బ్రిటన్ లో ఓ తల్లి నాలుగు నెలలకే గర్భస్రావం కావడంతో ఆ పిండాన్ని ఫ్రిజ్ లో పెట్టిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకెళితే.. లండన్‌లో (Kingdom of Great Britain) లారెన్స్ వైట్, లారా బ్రాడీ జంట పిల్లల కోసం ఎదురుచూస్తోంది. అయితే అంతకుముందే ఒకసారి గర్భస్రావం జరిగి ఉండటంతో ఈ సారి అలాంటి ఘటన జరగకూడదని ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. వైద్యులు మీకేం భయం లేదు. ఈసారి గర్భస్రావం జరిగే ఛాన్సే లేదని చెప్పారు. అయితే సదరు యువతి బాత్రూంలో ఉండగా.. నాలుగో నెలలోనే గర్భస్రావం జరిగింది.
దీనిపై వారు మాట్లాడుతూ.. గర్భస్రావం అవ్వగానే ఆస్పత్రికి వెళ్లామని, అయితే అక్కడి వైద్యులుగానీ, నర్సులు కానీ తమను పట్టించుకోలేదని లారా తెలిపింది. అలాగే ధ్రువ పత్రాలు లేని కారణంగా ఆ పిండాన్ని మార్చురీలో పెట్టడం కుదరదని (hospital’s refusal) తేల్చి చెప్పారని వాపోయింది. దీంతో ఏం చెయ్యాలో తెలియని స్థితిలో లంచ్ బాక్సులో పిండాన్ని పెట్టుకొని ఇంటికి తెచ్చామని, రాగానే ఫ్రిజ్‌లో కొంత భాగం ఖాళీ చేసి, అక్కడ పిండాన్ని ఉంచామని (Woman keeps stillborn baby in fridge) లారెన్స్ వెల్లడించాడు.
ఎమర్జెన్సీ నెంబర్ 999కు కాల్ చేస్తే.. అది ఎమర్జెన్సీ కాదని చెప్పి కట్ చేసినట్లు ఆయన తెలిపాడు. ‘‘పిండంతో ఆస్పత్రికి వెళ్తే.. 20-30 మంది జనాల మధ్యలో వేడెక్కిపోయి ఉన్న జనరల్ వెయిటింగ్ రూంలో కూర్చోబెట్టారు. ఎవరూ కూడా తమ బిడ్డ అవశేషాలను అలా బాక్సులో పెట్టుకొని తిరగాలని అనుకోరు. కానీ అక్కడ వాటిని పక్కన పడేశారు. ఎవరూ పట్టించుకోలేదు. అదేదో చెత్తలా చూశారు’’ అంటూ ఆ తల్లి కన్నీరు పెట్టుకుంది. గర్భస్రావాల గురించి ఇటీవలే ఒక డాక్యుమెంటరీ చూశానని, అందుకే ఈ విషయం అందరితో పంచుకోవడానికి ముందుకొచ్చానని లారా తెలిపింది. పాతకాలంలోనే కాదు.. ప్రస్తుత లండన్ మహానగరంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేందుకే తను ముందుకొచ్చినట్లు పేర్కొంది. ఈ విషయం తెలుసుకున్న యూనివర్సిటీ ఆస్పత్రి.. లారా దంపతులకు ఎదురైన అనుభవంపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది.