Pre Release Event In Graveyard: స్మశానంలో హర్రర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్, వెరైటీ ప్రమోషన్స్ లో మరో మెట్టు పైకెక్కిన టాలీవుడ్ మేకర్స్
హర్రర్ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event In Graveyard) లాంటి ఒక ఫంక్షన్ ని హైదరాబాద్ బేగంపేట స్మశానంలో చేయాలని అనుకున్నట్టు టాలీవుడ్ సమాచారం. ఆల్రెడీ స్మశానం (Graveyard) లొకేషన్ కూడా చూసి వచ్చారంట ఆ మూవీ యూనిట్. వాళ్ళు చేయాలనుకున్నా జనాలు అక్కడికి వస్తారా? గెస్టులు అక్కడికి వస్తారా? అసలు స్మశానంలో పర్మిషన్ ఇస్తారా అనే డౌట్స్ కూడా వచ్చాయి.
Hyderabad, FEB 22: ఇటీవల సినిమాలు ప్రమోషన్స్ చాలా కొత్త కొత్తగా చేస్తున్నాయి. తమ సినిమాని జనాల వద్దకు తీసుకెళ్లడానికి మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో కొత్త పుంతలు తొక్కుతుంది. కొంతమంది కాలేజీలకు, హోటల్స్ కి, మాల్స్ కి, ఆఖరికి రోడ్ల మీద, ట్రైన్స్ లో.. కూడా సినిమా ప్రమోషన్స్ చేస్తూ తమ సినిమాలకి (Tollywood) కొత్త రకం పబ్లిసిటీ చేస్తున్నారు. తాజాగా ఓ హారర్ సినిమా (Horror Movie) మూవీ యూనిట్ ఒక అడుగు ముందుకేసి సరికొత్తగా ఆలోచించింది. టాలీవుడ్ లో ఇటీవల భయపెట్టే హారర్ సినిమాలు కూడా చాలా వస్తున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో రాబోయే ఓ హర్రర్ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event In Graveyard) లాంటి ఒక ఫంక్షన్ ని హైదరాబాద్ బేగంపేట స్మశానంలో చేయాలని అనుకున్నట్టు టాలీవుడ్ సమాచారం. ఆల్రెడీ స్మశానం (Graveyard) లొకేషన్ కూడా చూసి వచ్చారంట ఆ మూవీ యూనిట్. వాళ్ళు చేయాలనుకున్నా జనాలు అక్కడికి వస్తారా? గెస్టులు అక్కడికి వస్తారా? అసలు స్మశానంలో పర్మిషన్ ఇస్తారా అనే డౌట్స్ కూడా వచ్చాయి.
దీంతో ఆ మూవీ యూనిట్ ఇవన్నీ వర్కౌట్ అవ్వక స్మశానంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కుదరకపోతే స్మశానం దగ్గర్లో ఉండే ఖాళీ ప్లేసెస్ ని ఈవెంట్ కోసం చూస్తాయట. ఈ విషయం బయటకి వచ్చి టాలీవుడ్ ఆశ్చర్యపోతుంటే ఇది తెలిసిన జనాలు మాత్రం ఇలా కూడా ప్రమోషన్స్ చేస్తారా? మరీ ఓవర్ గా అనిపించట్లేదా? అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ హారర్ సినిమా ఏంటి? నిజంగానే స్మశానంలో ఈవెంట్ చేస్తారా? స్మశానం దగ్గర చేస్తారా? అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
(The above story first appeared on LatestLY on Feb 22, 2024 10:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

