Producer Vedaraju Passes Away: టాలీవుడ్ లో విషాదం.. ఈ ఉదయం కన్నుమూసిన నిర్మాత వేదరాజు టింబర్

టాలీవుడ్ లో విషాదం నెలకొన్నది. నిర్మాత వేదరాజు టింబర్ (54) కన్నుమూశారు. ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. వేదరాజు గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నారు.

Producer Vedaraju Passes Away: టాలీవుడ్ లో విషాదం.. ఈ ఉదయం కన్నుమూసిన నిర్మాత వేదరాజు టింబర్
Tollywood Logo

Hyderabad, Jan 31: టాలీవుడ్ (Tollywood) లో విషాదం నెలకొన్నది. నిర్మాత వేదరాజు టింబర్ (54) (Producer Vedaraju Passes Away) కన్నుమూశారు. ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. వేదరాజు గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో కొంత కాలంగా ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరలోనే కోలుకొని, ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తారని అందరూ భావిస్తున్న తరుణంలో ఆయన కన్నుమూయడం టాలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. వేదరాజు అంత్యక్రియలు ఈరోజే జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వేదరాజు మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు.

యూనివర్సిటీ ప్రొఫెసర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. పదవీ విరమణ వయసును 65కు పెంచిన రేవంత్ సర్కారు 

ఇవీ సినిమాలు

'మడత కాజా', 'సంఘర్షణ' వంటి చిత్రాలను వేదరాజు నిర్మించారు. నిర్మాణ రంగంలో బిజీగా ఉంటూనే... సినిమాలపై ఇష్టంతో ఆయన నిర్మాతగా మారారు. మరో చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలోనే ఆయన మృతి చెందడం చిత్ర పరిశ్రమకు నిజంగానే తీవ్రమైన లోటుగా అభిమానులు చెప్తున్నారు.

ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి, గోషామహల్‌ స్టేడియంలో 2వేల పడకల కెపాసిటీతో నిర్మాణం

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).