Foundation To Osmania Hospital New Building: ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి, గోషామహల్‌ స్టేడియంలో 2వేల పడకల కెపాసిటీతో నిర్మాణం

తెలంగాణ వైద్య ఆరోగ్య చ‌రిత్ర‌లో (Health) మ‌రో కొత్త శ‌కం ప్రారంభం కానున్నది. వందేళ్లుగా తెలంగాణతో (Telangana) పాటు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, పొరుగున ఉన్న మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించిన ఉస్మానియా దవాఖానకు నూత‌న భ‌వ‌నం నిర్మించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

Foundation To Osmania Hospital New Building: ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి, గోషామహల్‌ స్టేడియంలో 2వేల పడకల కెపాసిటీతో నిర్మాణం
osmania hospital (Photo-Video Grab)

Hyderabad, JAN 30: తెలంగాణ వైద్య ఆరోగ్య చ‌రిత్ర‌లో (Health) మ‌రో కొత్త శ‌కం ప్రారంభం కానున్నది. వందేళ్లుగా తెలంగాణతో (Telangana) పాటు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, పొరుగున ఉన్న మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించిన ఉస్మానియా దవాఖానకు నూత‌న భ‌వ‌నం నిర్మించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ఉస్మానియా దవాఖాన అఫ్జ‌ల్ గంజ్‌లో ఉంది. నూత‌న దవాఖానను గోషామ‌హ‌ల్ స్టేడియంలో నిర్మిస్తారు. నూత‌న ఆసుప‌త్రి భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్ర‌వారం భూమి పూజ చేయ‌నున్నారు.

Telangana: ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స  

2,000 ప‌డ‌క‌ల సామ‌ర్ధ్యంతో మొత్తం 32 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో నూత‌న ఉస్మానియా ఆసుప‌త్రిని (Osmania Hospital New Building) నిర్మించ‌నున్నారు. 26 ఎక‌రాల విస్తీర్ణంలో కార్పొరేట్ ఆసుప‌త్రుల‌ను త‌ల‌ద‌న్నేలా నూతన ఉస్మానియా ఆసుపత్రి భవనం నిర్మించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. పూర్తి వ‌స‌తుల‌తో వచ్చే వందేండ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు నూత‌న ఆసుప‌త్రి నిర్మించాల‌ని ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌మీక్ష‌లో అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Telangana Congress Social Media: తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా.. పబ్లిక్ పోల్ పెట్టి మరి ఇలా చేశారేంటి?!, కేసీఆర్ పాలననే కోరుకున్న నెటిజన్లు 

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల‌కు అనుగుణంగా అన్నిరకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్ర‌తి డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్‌కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఒకే చోట అన్నిరకాల డయాగ్నసిస్‌ సేవలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్‌ కూడిన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్ల‌కు రూప‌క‌ల్ప‌న చేశారు.

అలాగే అండ‌ర్ గ్రౌండ్ రెండు ఫ్లోర్ల‌లో పార్కింగ్‌, ఆసుప‌త్రి స‌మీపంలో ఫైర్ స్టేష‌న్‌, ఆసుప‌త్రి చుట్టూ విశాల‌మైన ర‌హ‌దారులు, ఆసుప‌త్రి ప్రాంగణంలో ఎక్క‌డికైనా ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు తిరిగే మార్గాలు, దివ్యాంగులు ఆసుప‌త్రిలోకి రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా ర్యాంప్‌లు, ఆసుప‌త్రిలోని రోగుల‌కు స‌హాయ‌కులుగా వ‌చ్చే వారు సేద తీరేందుకు డార్మెట‌రీలు, క్యాంటీన్‌, మ‌రుగుదొడ్లు నిర్మించ‌నున్నారు.

(The above story first appeared on LatestLY on Jan 30, 2025 10:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).