Devarakonda on Samantha: సమంతతో అప్పుడే ప్రేమలో పడిపోయా.. ఆమె ఏంచేసినా నాకు నచ్చుతుంది. ఇప్పుడు కూడా ఆమెను ఆరాధిస్తున్నా.. స్యామ్ పై తన అభిమానాన్ని వెల్లడించిన విజయ్ దేవరకొండ

సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం యశోద.. ట్రైలర్ ను పంచుకున్న విజయ్ దేవరకొండ.. కాలేజీ రోజుల్లో సమంత అభిమానిని అని వెల్లడి.. ఇప్పటికీ ఆరాధిస్తుంటానంటూ ట్వీట్

Devarakonda on Samantha: సమంతతో అప్పుడే ప్రేమలో పడిపోయా.. ఆమె ఏంచేసినా నాకు నచ్చుతుంది. ఇప్పుడు కూడా ఆమెను ఆరాధిస్తున్నా.. స్యామ్ పై తన అభిమానాన్ని వెల్లడించిన విజయ్ దేవరకొండ
Credits: Twitter

Hyderabad, October 28: టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత (Samantha) ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘యశోద’ (Yashoda). హరి-హరీశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంతతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sharathkumar), ఉన్ని ముకుందన్, రావు రమేశ్, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేశ్ తదితరులు నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ (Trailer) వీడియోను టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ సందర్భంగా సమంతపై తన అభిమానాన్ని వెల్లడించారు.

అమావాస్యనాడు.. సూర్యగ్రహణం ఘడియల్లో.. శ్మశానంలో ఖననం చేసిన పదేండ్ల బాలిక తలను వేరుచేసి తీసుకెళ్ళిన మంత్రగాడు.. క్షుద్రపూజల కోసమేనా?.. తమిళనాడులో ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన

కాలేజీ రోజుల్లో సమంతను మొట్టమొదటిసారిగా స్క్రీన్ పై చూసి అభిమానిగా మారిపోయానని, ఆమెతో ప్రేమలో పడిపోయానని తెలిపారు. సమంత ఏంచేసినా తనకు నచ్చుతుందని, ఇప్పుడామెను ఆరాధిస్తున్నానని విజయ్ దేవరకొండ వెల్లడించారు. సమంత నటించిన కొత్త చిత్రం యశోద ట్రైలర్ ను మీ అందరితో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు.

(The above story first appeared on LatestLY on Oct 28, 2022 09:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).