Chennai, October 28: తమిళనాడులో (Tamilanadu) ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన ఒకటి ఇటీవల జరిగింది. శ్మశానంలో (Graveyard) ఖననం చేసిన ఓ పదేండ్ల బాలిక (Girl) మృతదేహం (Deadbody) నుంచి తలను (Head) వేరుచేసిన దుండగులు.. దాన్ని ఎత్తుకెళ్ళడం స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. చెంగల్పట్టు జిల్లాలోని చిత్తిరవాడి గ్రామానికి చెందిన కృత్తిక అనే బాలిక ఆడుకుంటుండగా విద్యుత్తు స్థంభం పడి ఈనెల 5న మరణించింది.
దీంతో ఆమె మృతదేహాన్ని శ్మశానంలో ఖననం చేశారు. అయితే, ఈ నెల 25న అమావాస్యనాడు.. సూర్యగ్రహణం ఘడియల్లో ఖననం చేసిన చోట ఎవరో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్ళు కనిపించినట్టు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక మృతదేహం నుంచి తలను ఖండించి దుండగులు తీసుకెళ్ళినట్టు చెప్పారు. క్షుద్రపూజల కోసం ఎవరైనా మాంత్రికుడు ఈ తలను తీసుకెళ్ళాడా? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.