Musk (Credits: ANI)

Newdelhi, October 28: టెస్లా (Tesla) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ఎట్టకేలకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ (Twitter)ను సొంతం చేసుకున్నారు. వచ్చీ రాగానే టాప్ ఎగ్జిక్యూటివ్‌‌లపై వేటేశారు. ఈ మేరకు యూఎస్ మీడియా (US Media) గత అర్ధరాత్రి దాటాక పేర్కొంది. ఈ డీల్‌తో ప్రపంచంలోనే అతి పెద్దదైన సోషల్ మీడియా చర్చా వేదిక మస్క్ చేతికి చిక్కినట్టు అయింది. ట్విట్టర్ కొనుగోలు విషయంలో ఈ నెల 28 లోపు ఏదో ఒక నిర్ణయానికి రావాలంటూ కోర్టు తుది గడువు విధించిన నేపథ్యంలో ట్విట్టర్‌ను మస్క్ సొంతం చేసుకున్నారు. మొత్తంగా 44 బిలియన్ డాలర్లకు ఈ డీల్ కుదిరింది.

చాయిపత్తి అనుకుని పిచికారీ మందుతో టీ తయారు చేసింది ఆ అమాయకురాలు.. ఇద్దరు బిడ్డలు, భర్త, మామ, మరోవ్యక్తికి ఆ విషపూరిత టీని ప్రేమగా అందించింది. టీలో ఉన్నది చాయిపత్తి కాదు.. పురుగులను చంపే విషమని తెలియక.. ఆ టీని వాళ్ళు తాగేశారు. తర్వాత? యూపీలో ఐదుగురి ప్రాణాలను బలిగొన్న ఇల్లాలి చిన్న పొరపాటు

ట్విట్టర్ తన చేతికి వచ్చిన వెంటనే సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దె, ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్‌ సీన్ హెడ్గెట్‌లపై మస్క్ వేటేసినట్టు ‘వాషింగ్టన్ పోస్ట్’, ‘సీఎన్‌బీసీ’ పేర్కొన్నాయి. ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్నట్టు మస్క్ నిన్న ట్వీట్ చేశారు. ట్విట్టర్‌ను తాను కొనుగోలు చేస్తున్నానని, నాగరికత భవిష్యత్‌కు ఉమ్మడి డిజిటల్ టౌన్‌ స్క్వేర్‌ను కలిగి ఉండడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఇక్కడ పలు రకాల నమ్మకాలను ఆరోగ్యకరమైన రీతిలో చర్చించవచ్చని అన్నారు.