Family Star Movie Team Files Complaint: నెగిటివ్ రివ్యూల‌పై పోలీస్ స్టేష‌న్ మెట్లెక్కిన ఫ్యామిలీ స్టార్ టీమ్, కేర‌ళ త‌ర‌హా తీర్పు వ‌స్తే బాగుండు అని అభిప్రాయ‌ప‌డ్డ దిల్ రాజు

సోషల్‌మీడియాలో మరోలా ట్రోల్‌ చేస్తున్నారంటూ చిత్ర నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఆవేదన వ్యక్తం చేశారు. నెగెటివ్‌ ప్రచారం ఇండస్ట్రీకి మంచిది కాదని, సినిమా విజయం సాధించాలంటే అందరూ ఆమోదించాల్సిందే కానీ, మంచి సినిమాకు ప్రేక్షకులు రాకుండా అడ్డుకోవడం బాగోలేదన్నారు.

Family Star Movie Team Files Complaint: నెగిటివ్ రివ్యూల‌పై పోలీస్ స్టేష‌న్ మెట్లెక్కిన ఫ్యామిలీ స్టార్ టీమ్, కేర‌ళ త‌ర‌హా తీర్పు వ‌స్తే బాగుండు అని అభిప్రాయ‌ప‌డ్డ దిల్ రాజు
Vijay Deverakonda (PIC @ X)

Hyderabad, April 07: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్‌’ (The Family Star). మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలో ‘ఫ్యామిలీస్టార్‌’ గురించి దుష్ప్రచారం చేస్తున్న వారిపై విజయ్‌ దేవరకొండ టీమ్‌కు మాదాపూర్ పీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ వింగ్‌లో ఫిర్యాదు చేసింది. ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో నెగిటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారని విజయ్‌ టీమ్‌ తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టుల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. పోస్టులకు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పోలీసులకు ఇచ్చింది. ‘ఫ్యామిలీస్టార్‌’పై ప్రేక్షకుల స్పందన ఒకలా ఉంటే, సోషల్‌మీడియాలో మరోలా ట్రోల్‌ చేస్తున్నారంటూ చిత్ర నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఆవేదన వ్యక్తం చేశారు. నెగెటివ్‌ ప్రచారం ఇండస్ట్రీకి మంచిది కాదని, సినిమా విజయం సాధించాలంటే అందరూ ఆమోదించాల్సిందే కానీ, మంచి సినిమాకు ప్రేక్షకులు రాకుండా అడ్డుకోవడం బాగోలేదన్నారు.

Pushpa 2 – The Rule: పుష్ప‌-2 లో శ్రీవ‌ల్లి లుక్ సింప్లీ సూప‌ర్బ్‌, రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్, ఆగ‌స్టు 15వ తేదీన సినిమా విడుదల

‘‘సినిమా చూసిన కుటుంబ ప్రేక్షకులు బాగుందని అంటున్నారు. అందరూ మూవీని ఆస్వాదిస్తున్నారు. ఒక మంచి సినిమా తీశాం. మీరు థియేటర్‌కు వచ్చి చూడండి. నచ్చితే నలుగురికి చెప్పండి. నచ్చకపోతే, మీ అభిప్రాయాన్ని నేనూ గౌరవిస్తా. చాలా మంది మూవీ తమకు నచ్చిందని ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారు. మరికొందరేమో సినిమాకు ఎందుకలా నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నారని అడుగుతున్నారు. రిలీజ్‌ కాకముందు నుంచే ఇలాంటి ప్రచారం మొదలు పెట్టారని చెబుతున్నారు. మేం ఎలాంటి మూవీ తీశామో చూస్తే మీకే అర్థమవుతుంది. కేరళలో సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు రివ్యూలు, రేటింగ్‌లు ఇవ్వకూడదంటూ కోర్టు తీర్పు ఇచ్చిందట. అలాంటిదేదో వస్తే కానీ ఇండస్ట్రీ బాగుపడదు. నెగెటివ్‌ రివ్యూల వల్ల ఎవరెవరిపై ప్రభావం చూపుతుందో ఎవరూ చూడటం లేదు. నెగెటివ్‌ ప్రచారం వల్ల కష్టపడి సినిమా తీసిన నిర్మాతలు నష్టపోతున్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత నష్టం చేకూరుస్తుంది. ఇక సినిమాలు తీయాలన్న ఆలోచన కూడా రాదు. దానివల్ల చాలా మార్పులు వస్తాయి. ఒకవేళ సినిమా బాగోలేకపోతే అది మీ అభిప్రాయం. దాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ఎత్తి చూపుతూ ప్రేక్షకులపై రుద్దడం సరికాదు’’ అని దిల్‌రాజు అన్నారు.

(The above story first appeared on LatestLY on Apr 07, 2024 09:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).