ప్రముఖ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమె న‌టించిన పుష్ప‌-2 మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్రం యూనిట్‌ శుక్ర‌వారం విడుద‌ల చేసింది. ఆకుప‌చ్చ‌ని చీర‌లో భారీగా న‌గ‌లు ధ‌రించి సింప్లీ సూప‌ర్బ్‌గా శ్రీవ‌ల్లి క‌నిపిస్తోంది. ఇక కొన్నిరోజుల క్రితం మూవీ సెట్ నుంచి లీక్ అయిన ర‌ష్మిక ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే. కాగా, ర‌ష్మిక మంద‌న్న పుష్ప‌-2 తో పాటు ది గ‌ర్ల్‌ఫ్రెండ్, రెయిన్‌బో చిత్రాల్లో కూడా న‌టిస్తోంది. ఇక ఆమె చివ‌రి చిత్రం యానిమల్ హిందీతో పాటు తెలుగులో కూడా సూప‌ర్‌ హిట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. పుష్ప‌-2 మూవీ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఆగ‌స్టు 15వ తేదీన సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఈ నెల 8న హీరో అల్లు అర్జున్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పుష్ప మూవీ టీమ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. పుష్ప 2 నుంచి క్రేజీ అప్‌డేట్, ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్‌ డే సందర్భంగా టీజర్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటన

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)