Deepthi Break up with Shanmukh: షణ్ముక్‌కు బ్రేకప్ చెప్పిన దీప్తి, మీరంతా అనుకున్నట్లే విడిపోతున్నామంటూ పోస్ట్, షాక్‌లో షణ్ముక్ ఫ్యాన్స్

బిగ్‌ బాస్ ఫేమ్‌ షణ్ముక్ జస్వంత్(shanmukh jaswanth), దీప్తి సునయన(Deepthi sunaina) బ్రేకప్(break up) పై క్లారిటీ వచ్చింది. కొత్త సంవత్సరం రోజు దీప్తి సునయన తమ బ్రేకప్‌ పై సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది. ఐదేళ్ల తమ ప్రేమబంధానికి పుల్ స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించింది. షణ్ముక్(shanmukh jaswanth) బిగ్ బాగ్‌ హౌజ్‌(Bigg Boss House)లోకి వెళ్లిన తర్వాత ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది.

Deepthi Break up with Shanmukh: షణ్ముక్‌కు బ్రేకప్ చెప్పిన దీప్తి, మీరంతా అనుకున్నట్లే విడిపోతున్నామంటూ పోస్ట్, షాక్‌లో షణ్ముక్ ఫ్యాన్స్

Hyderabad January 01: బిగ్‌ బాస్ ఫేమ్‌ షణ్ముక్ జస్వంత్(shanmukh jaswanth), దీప్తి సునయన(Deepthi sunaina) బ్రేకప్(break up) పై క్లారిటీ వచ్చింది. కొత్త సంవత్సరం రోజు దీప్తి సునయన తమ బ్రేకప్‌ పై సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది. ఐదేళ్ల తమ ప్రేమబంధానికి పుల్ స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించింది.

షణ్ముక్(shanmukh jaswanth) బిగ్ బాగ్‌ హౌజ్‌(Bigg Boss House)లోకి వెళ్లిన తర్వాత ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. అతను బయటకు వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య మాటలు లేకుండా పోయాయి. వీరిద్దరూ మళ్లీ కలుస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ బ్రేకప్‌ పై సునయన పోస్టుతో(Deepthi sunaina post) ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

Bigg Boss 5 Telugu: దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్, కొంప ముంచిన సిరి ముద్దు, ఇన్ స్టాగ్రామ్ సాక్షిగా రచ్చ రంబోలా..

షణ్ముక్‌తో బ్రేకప్‌పై దీప్తి సునయన ఏం పోస్టు చేసిందంటే... "శ్రేయోభిలాషులు, స్నేహితులంద‌రికీ ఒక విష‌యం చెప్పాలి. నేను, ష‌ణ్ముఖ్ ఇద్ద‌రం ప‌ర‌స్పర అంగీకారంతో విడిపోయి ఎవ‌రి దారి వారు చూసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఎంతో ఆలోచించి ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. గ‌త ఐదేళ్ల‌లో మేమిద్దరం ఎంతో సంతోషంగా గ‌డిపాం. ఆ స‌మ‌యంలోనే మాలోని రాక్ష‌సుల‌తో పోరాడాం. చివ‌ర‌కు మీరంద‌రూ కోరుకున్న‌ట్లుగానే ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. దీనిపై చాలాకాలంగానే అనుకుంటున్నాం. కానీ సోష‌ల్ మీడియాలో క‌నిపించినంత సులువేం కాదు. ఇద్ద‌రం క‌లిసి ఉండేందుకు చాలా ప్ర‌య‌త్నించాం. ఈ క్ర‌మంలో మా లైఫ్‌లో ఏది అయితే అవ‌స‌ర‌మో దాన్నే విస్మ‌రించాం. చివ‌ర‌కు మా దారులు వేర‌ని అర్థం చేసుకున్నాం. అందుకే ఇక్క‌డితో ఆగిపోకుండా ముందుకు సాగాల‌ని భావించాం. ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. ఇప్పుడు ఇది మాకు ఎంతో క్లిష్ట‌మైన స‌మ‌యం. కాబ‌ట్టి ఈ పరిస్థితుల్లో మా ప్రైవ‌సీకి భంగం క‌లిగించార‌ని ఆశిస్తున్నాం" అంటూ దీప్తి సున‌యిన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. అంతేకాకుండా కామెంట్ సెక్ష‌న్‌ను కూడా ఆఫ్ చేసింది. ఏదేమైనా న్యూఇయ‌ర్ రోజున దీప్తి సున‌యిన త‌న బ్రేక‌ప్ విష‌యాన్ని ప్ర‌క‌టించడం అంద‌ర్నీ షాక్‌కు గురిచేసింది. కొత్త సంవ‌త్స‌రంలో క‌లిసి పోతార‌ని అనుకుంటే ఇలా విడిపోయారేంట‌ని అభిమానులు విచారం వ్య‌క్తం చేస్తున్నారు.

యూట్యూబ్‌(YouTube), డ‌బ్‌స్మాష్(Dub smash) వీడియోల ద్వారా దీప్తి, ష‌ణ్ముఖ్ మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఇద్ద‌రికీ డ్యాన్స్‌పై ఇష్టం ఉండ‌టంతో తొంద‌ర‌గా ఇద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది ప్రేమ‌గా మారింది. కానీ ష‌ణ్ముఖ్ బిగ్‌బాస్(Bigg boss) షోకు వ‌చ్చిన త‌ర్వాత సిరితో బాగా క‌నెక్ట్ అయ్యాడు. బిగ్‌బాస్ హౌస్‌లో సిరి, షణ్నూ ప్ర‌వ‌ర్త‌న‌, ఇద్ద‌రి హ‌గ్గులు, ముద్దుల‌పై సోషల్‌మీడియాలో చాలా కామెంట్లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే దీప్తి సున‌యిన‌తో ష‌ణ్నూకు చెడింది. దీంతో వీరిద్ద‌రూ విడిపోయిన‌ట్లు కొంత‌కాలంగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో స్పందించిన ష‌ణ్ముఖ్‌.. దీప్తి సున‌యిన త‌న‌పై అలిగింద‌ని.. అందుకే బ్లాక్ చేసింద‌ని చెప్పాడు. త్వ‌ర‌లోనే క‌లుస్తామ‌ని చెప్పాడు. దీంతో వీరిద్ద‌రూ క‌లిసిపోతార‌ని ఆశించిన ఫ్యాన్స్‌కు దీప్తి సున‌యిన షాకిచ్చింది. ష‌ణ్ముఖ్‌తో విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

(The above story first appeared on LatestLY on Jan 01, 2022 04:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).