Bigg Boss Shiva Jyothi: మీకో దండం.. నేను ప్రెగ్నెంట్ కాదు, ఓ ఈవెంట్‌కి వెళుతూ మామిడి కాయతో ఫోటో పెట్టా, ఫేక్‌న్యూస్‌ ప్రచారం చేయకండని తెలిపిన యాంకర్‌ శివజ్యోతి

బిగ్‌బాస్‌ షోతో మరింత పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్‌ శివజ్యోతి (Bigg Boss Shiva Jyothi) లేటెస్ట్ గా తనపై వచ్చిన రూమర్లపై స్పందించింది. ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. 'నా గురించి నాకు తెలియకుండానే వార్తలు (pregnancy rumours) వస్తున్నాయి.

Bigg Boss Shiva Jyothi: మీకో దండం.. నేను ప్రెగ్నెంట్ కాదు, ఓ ఈవెంట్‌కి వెళుతూ మామిడి కాయతో ఫోటో పెట్టా, ఫేక్‌న్యూస్‌ ప్రచారం చేయకండని తెలిపిన యాంకర్‌ శివజ్యోతి
Bigg Boss fame Shiva Jyothi (Photo-Twitter)

బిగ్‌బాస్‌ షోతో మరింత పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్‌ శివజ్యోతి (Bigg Boss Shiva Jyothi) లేటెస్ట్ గా తనపై వచ్చిన రూమర్లపై స్పందించింది. ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. 'నా గురించి నాకు తెలియకుండానే వార్తలు (pregnancy rumours) వస్తున్నాయి. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌కి వెళుతూ మామిడి కాయతో ఫోటో పెట్టా. ఇక అంతే.. అప్పటి నుంచి నేను ప్రెగ్నెంట్‌ అంటూ ఫేక్‌న్యూస్‌ సృష్టిస్తున్నారు. వ్యూస్‌ కోసం కక్కుర్తి పడి ఇష్టం వచ్చినట్లు థంబ్‌నైల్స్‌ వేస్తున్నారు. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా నాపై చాలా ఎఫెక్ట్‌ చూపిస్తుంది.

అవును మాకు పెళ్లయి చాలా సంవత్సరాలు అయ్యింది. మా పిల్లల కోసం మా ఫ్యామిలీ అంతా ఎంతో ఎదురుచూస్తుంది. నేను కూడా వెయిట్‌ చేస్తున్నా. ఇది ఎమోషనల్‌గా ఎంత బాధపెడుతుందో మీకు చెప్పలేను. నేను ప్రెగ్నెంట్‌ అంటూ వార్తలు వస్తుండటంతో కొన్ని ఈవెంట్స్‌ చేయనేమో అని అనుకుంటున్నారు. అలా నా వర్క్‌ని కూడా దెబ్బతీస్తున్నారు. ఇందులో నా ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీని కూడా ఇన్‌వాల్వ్‌ చేస్తున్నారు. అందుకే ఇలా వీడియో చేస్తున్నా. ప్లీజ్‌.. ప్రెగ్నెన్సీ అన్నది నా జీవితంలో చాలా పెద్ద విషయం. కాబట్టి నిజంగా నా లైఫ్‌లో ఆ గుడ్‌న్యూస్‌ ఉంటే నేనే మీ అందరితో షేర్‌ చేస్తాను. అప్పటివరకు ఇలా ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేయకండి' అంటూ చెప్పుకొచ్చింది.

చేతిలో డబ్బులు లేక చచ్చిపోవాలనుకున్న జబర్దస్త్ అవినాష్, మల్లెమాల అగ్రిమెంట్ రద్దు చేయాలంటే పది లక్షలు కట్టాలంటూ కన్నీళ్లు

బిగ్‌బాస్‌ సీజన్‌-3లో పాల్గొని టాప్‌ 6 కంటెస్టెంట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. షో తర్వాత వరుస అవకాశాలతో ఫుల్‌ బిజీగా మారిన శివజ్యోతి తన యూట్యూబ్‌ చానల్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్‌ చేస్తుంటుంది.

(The above story first appeared on LatestLY on Apr 19, 2022 04:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).