Getup Srinu: సుధీర్, రష్మి రిలేషన్‌పై గెటప్ శ్రీను సంచలన వ్యాఖ్యలు, త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిపిన కమెడియన్
గెటప్ శ్రీను మాట్లాడుతూ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నాను. అయితే అదే సమయంలో సపరేట్ టీం లీడర్ గా అవకాశం ఇవ్వడంతో ఆటో రాంప్రసాద్ వారానికి నాలుగు స్క్రిప్టులు రాయాల్సి వచ్చింది. ఇక ఇలా నాలుగు స్క్రిప్ట్ లు రాసే లోపు స్క్రిప్టులో క్వాలిటీ కూడా తగ్గిపోయింది
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసే జబర్దస్త్ కార్యక్రమంలో నుంచి బయటకు వచ్చిన కమెడియన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. చాలామంది జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడం ఆ తర్వాత జబర్దస్త్ గురించి చాలా అధ్వానంగా చెప్పడం, అన్నీ కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. కాగా గెటప్ శ్రీను (Getup Srinu) సుధీర్ కంటే ముందే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గెటప్ శ్రీను తాను జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి గల కారణాన్ని (Getup Srinu Sensational Comments) కూడా తెలియజేయడం జరిగింది.
గెటప్ శ్రీను మాట్లాడుతూ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నాను. అయితే అదే సమయంలో సపరేట్ టీం లీడర్ గా అవకాశం ఇవ్వడంతో ఆటో రాంప్రసాద్ వారానికి నాలుగు స్క్రిప్టులు రాయాల్సి వచ్చింది. ఇక ఇలా నాలుగు స్క్రిప్ట్ లు రాసే లోపు స్క్రిప్టులో క్వాలిటీ కూడా తగ్గిపోయింది. ఇంకొక వైపు సినిమా అవకాశాలు కూడా రావడంతో ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నాను అని శ్రీను వెల్లడించారు.
ఇక అంతే కాదు సుధీర్, రష్మీ రిలేషన్ గురించి కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. ఇక వారిద్దరి గురించి మాట్లాడుతూ వాళ్ళిద్దరూ కేవలం షో కోసం మాత్రమే అలాంటి పర్ఫామెన్స్ చేశారే తప్ప, వారిద్దరి మధ్య ఎలాంటి లవ్ లేదని, ఇప్పటికే సుధీర్ కి పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయని, త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గెటప్ శ్రీను వెల్లడించారు. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్స్ అందరూ కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా తొందరగా స్పందించి వారిని ఆదుకుంటారు. అయితే ఈ విషయాలు మాత్రం ఎవరు బయట చెప్పుకోరు అంటూ శ్రీను వెల్లడించారు.
(The above story first appeared on LatestLY on Jul 13, 2022 06:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

