Kirak RP On Jabardasth: కిర్రాక్ ఆర్పీ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్, జబర్దస్త్ సెట్ లో ఫుడ్ బాగోదు, అక్కడ మేనేజర్లకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ, జబర్దస్త్ పై రాకేష్ మాస్టర్ సంచలన కామెంట్స్..
( Photo-Twitter)

మల్లెమాల ప్రొడక్షన్స్, జబర్దస్ టీంపై కిర్రాక్ ఆర్పీ చేస్తున్న కామెంట్స్ హాట్ హాట్ గా మారాయి. దీనిపై ఇప్పటికే ఆర్పీ తగ్గేదే లేదంటూ మల్లెమాలపై బురద చల్లే పని చేస్తుంటే, అగ్నికి ఆజ్యం పోసినట్లు ఆర్పీ కి సపోర్ట్ గా రాకేష్ మాస్టర్ సైతం రంగంలోకి దిగాడు. రాకేష్ మాస్టర్ గతంలో బుల్లెట్ భాస్కర్ కోరిక మేరకు, జబర్దస్త్ లో దాదాపు 11 ఎపిసోడ్లు చేశారు. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను చెప్పుకొచ్చాడు.

ముఖ్యంగా జబర్దస్త్ లో నిజంగానే ప్రొడక్షన్ అస్సలు బాగుండదని, ముఖ్యంగా ఆర్పీ చేసిన ఆరోపణల్లో నిజం ఉందని, ఫుడ్ విషయంలో తాను కూడా చూశానని చెప్పుకొచ్చాడు. మల్లెమాల ప్రొడక్షన్ ఫుడ్ అస్సలు బాగుండదు అని చెప్పాడు. అంతేకాదు జబర్దస్త్ సెట్ లోని మేనేజర్లకు అమ్మాయిల పిచ్చి ఉందని రాకేష్ మాస్టర్ ఆరోపించాడు.

Telangana Rains: ఎవ్వరూ బయటకి రావొద్దు, భారీ వర్షాలపై ప్రజలకు సీఎం కేసీఆర్ హెచ్చరిక, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు 

అయితే శ్యాంప్రసాద్ రెడ్డికి ఈ విషయాలు తెలిసే అవకాశం లేదని అన్నాడు. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అని, అయితే చుట్టూ ఉన్న వారు ఆయనకు, కింది స్థాయిలో ఏం జరుగుతుందో తెలియనివ్వరని చెప్పుకొచ్చాడు. తనను బుల్లెట్ భాస్కర్ చాలా జాగ్రత్తగా చూసుకున్నాడని, అయితే తాను జబర్దస్త్ విషయంలో జరుగుతున్న తప్పులకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాత్రం కారణం అని తాను అనుకోవడం లేదని చెప్పుకొచ్చాడు.