Jabardasth Hyper Aadi: జబర్దస్త్‌ను హైపర్ ఆది అందుకే వదిలేశారా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్, జబర్దస్త్ షోలో రెండు మూడు ఎపిసోడ్స్ నుండి కనపడని ఆది
బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షోకు (Jabardasth show) ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కుతోందనే సంగతి తెలిసిందే. ఇక జబర్దస్త్ షోకు హైపర్ ఆది (Jabardasth Hyper Aadi) స్కిట్లు హైలెట్ గా నిలుస్తుంటే ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు సుడిగాలి సుధీర్ స్కిట్లు హైలెట్ గా నిలుస్తున్నాయి.
బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షోకు (Jabardasth show) ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కుతోందనే సంగతి తెలిసిందే. ఇక జబర్దస్త్ షోకు హైపర్ ఆది (Jabardasth Hyper Aadi) స్కిట్లు హైలెట్ గా నిలుస్తుంటే ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు సుడిగాలి సుధీర్ స్కిట్లు హైలెట్ గా నిలుస్తున్నాయి. వీళ్ల స్కిట్ల వల్లే ఈ కామెడీ షోలకు అంచనాలకు మించి రేటింగ్స్ వస్తున్నాయి. అయితే గత కొంతకాలంగా ఆది (Jabardasth fame Hyper Aadi) జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. యూట్యూబ్ లో జబర్దస్త్ ప్రోమో విడుదలైన సమయంలో ఆదిని మిస్ అవుతున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఆది ప్రస్తుతం ఈ షోకు దూరంగా ఉండటానికి రెమ్యునరేషన్ కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఢీ డ్యాన్స్ షోలో కనిపిస్తున్న హైపర్ ఆది జబర్దస్త్ లో కనిపించకపోవడంతో ఇది నిజం కావచ్చని చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆది అభిమానులు మాత్రం ఆది త్వరలోనే జబర్దస్త్ షోలో రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఒకవేళ ఆది జబర్దస్త్ కు దూరమైతే అందుకు గల కారణాలను అయినా వెల్లడించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇక జబర్దస్త్ లో ప్రస్తుతం హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వాళ్లలో ఆది ఒకరు. ఆది స్కిట్లకు యూట్యూబ్ లో కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే స్టార్ మా లో వస్తున్న కామెడీ స్టార్స్ షోని ఎలాగైనా నిలబెట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. నాగబాబు, శేఖర్ మాస్టర్ జడ్జిలుగా.. దీపిక యాంకర్ గా కామెడీ స్టార్స్ వస్తుంది. ఇప్పటికే జబర్దస్త్ నుండి అదిరే అభి కామెడీ స్టార్స్ కి షిఫ్ట్ అవగా ఈమధ్య చాలామంది అక్కడ నుండి ఇక్కడకు వచ్చేశారు. ఇక ఇప్పుడు రెండు మూడు ఎపిసోడ్స్ నుండి హైపర్ ఆది కూడా జబర్దస్త్ లో కనిపించడం లేదు. దాదాపు హైపర్ ఆది కూడా స్టార్ మా కి జంప్ అయ్యాడని స్మాల్ స్క్రీన్ టాక్. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే..
(The above story first appeared on LatestLY on Apr 23, 2022 12:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

