Ramesh Valiyasala Dies: తీవ్ర విషాదం..మరో నటుడు ఆత్మహత్య, ఉరి వేసుకుని చనిపోయిన ప్రముఖ మలయాళ టీవీ నటుడు రమేశ్ వలీయశాల, మాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు
మళయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ సినీ, టీవీ నటుడు రమేశ్ వలీయశాల (54) ఆత్మహత్య (Ramesh Valiyasala found hanging) చేసుకున్నారు. ఇటీవల బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా అకాల మరణం మరవక ముందే మరో నటుడి మృతి సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది.
మళయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ సినీ, టీవీ నటుడు రమేశ్ వలీయశాల (54) ఆత్మహత్య (Ramesh Valiyasala found hanging) చేసుకున్నారు. ఇటీవల బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా అకాల మరణం మరవక ముందే మరో నటుడి మృతి సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. 22 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈ సీనియర్ నటుడు శనివారం (సెప్టెంబర్ 11) ఉదయం తిరువనంతపురంలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆయన (Popular Kerala TV actor Ramesh Valiyasala ) మరణ వార్తతో మాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాద ఛాయలు అలుముకున్నాయి.
సోషల్ మీడియా వేదికగా నటీనటులు, దర్శక-నిర్మాతలు ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతూ రమేశ్ మృతికి నివాళులు ఆర్పిస్తున్నారు. కేరళ పరిశ్రమలో వరుసగా సీరియల్స్, సినిమాలు చేస్తూ నటుడిగా ఫుల్ బిజీగా ఉండే ఆయన ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా రెండు రోజుల క్రితం రమేశ్ వలీయశాల షూటింగ్ నుంచి తిరిగి ఇంటికి వచ్చారని, ఇలా ఈ రోజు జీవిచ్చవంలా కనిపించడంతో అతడి సహ నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు.
(The above story first appeared on LatestLY on Sep 11, 2021 05:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

