MLA Roja About Anchor Rashmi: నాకు అనసూయ కంటే రష్మీ అంటేనే ఎక్కువ ఇష్టం, కుండబద్దలు కొట్టి చెప్పి ఎమ్మెల్యే రోజా, కారణం ఏంటో తెలిస్తే షాక్ తింటారు...
యాంకర్ రష్మి గౌతమ్ (Anchor Rashmi Gautam)ప్రస్తుతం ఒక పక్కా జబర్దస్త్ కామెడీ షో లో యాంకరింగ్ నిర్వహిస్తూనే మరోపక్క పలు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తూ బాగానే ఆకట్టుకుంటోంది. కాగా ప్రస్తుతం తెలుగు యంగ్ హీరో నందు హీరోగా నటిస్తున్న “బొమ్మ బ్లాక్ బాస్టర్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.
Hyderabad, Dec 18: జబర్దస్త్ ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న యాంకర్ రష్మి గౌతమ్ (Anchor Rashmi Gautam)పై ఒకప్పటి స్టార్ హీరోయిన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. యాంకర్ రష్మీ ది చిన్న పిల్లల మనస్తత్వమని దాంతో అందరితోనూ ఇట్టే కలిసిపోతుందని అంతేకాకుండా కాంట్రవర్సీలకి చాలా దూరంగా ఉంటుందని కూడా తెలియజేసింది. అంతేకాదు రష్మి గౌతమ్ చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు అనుభవించిందని ఈ క్రమంలో తన సినిమా ఇండస్ట్రీలో కష్ట పడి సంపాదించిన డబ్బుతో తన కుటుంబాన్ని నెట్టుకొస్తూ తన అక్కల పెళ్లిళ్లు కూడా చేసిందని అలాగే సినిమా సెట్స్ లో కూడా చాలా ఎనర్జీతో యాక్టివ్ గా ఉంటుందని అందువల్లే తనకు రష్మి గౌతమ్ అంటే చాలా ఇష్టమని తెలిపింది.
ఇలా ఉండగా యాంకర్ రష్మి గౌతమ్ (Anchor Rashmi Gautam)ప్రస్తుతం ఒక పక్కా జబర్దస్త్ కామెడీ షో లో యాంకరింగ్ నిర్వహిస్తూనే మరోపక్క పలు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తూ బాగానే ఆకట్టుకుంటోంది. కాగా ప్రస్తుతం తెలుగు యంగ్ హీరో నందు హీరోగా నటిస్తున్న “బొమ్మ బ్లాక్ బాస్టర్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బుల్లితెర పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కమెడియన్ మరియు హీరో సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న మరో చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే యాంకర్ రష్మి గౌతమ్ (Anchor Rashmi Gautam)మొదటిగా ప్రముఖ స్వర్గీయ నటుడు ఉదయ్ కిరణ్ మరియు వెటరన్ హీరోయిన్ రిచా పల్లాడ్ నటించిన “హోలీ” అనే చిత్రం ద్వారా నటిగా తన సినీ కెరీర్ ని ఆరంభించింది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించినప్పటికీ ఈ అమ్మడి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో నటిగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.కానీ జబర్దస్త్ కార్యక్రమంలో యాంకర్ గా అవకాశం దక్కించుకున్న తర్వాత ఈ అమ్మడి సినిమా కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.
(The above story first appeared on LatestLY on Dec 18, 2021 02:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

