Hyper Aadi Girl Friend: జబర్దస్త్ హైపర్ ఆది గర్ల్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా? ఏకంగా టీవీ షోలో ప్రపోజ్‌ చేసిన ఆది, నిజమా? లేకపోతే ఇదికూడా స్క్రిప్ట్‌ లో భాగమా అంటూ ఫ్యాన్స్ ప్రశ్నలు

నేను నిజంగా ప్రేమించిన అమ్మాయి ఒకరు ఉన్నారు. బేబీ ఒక్కసారి స్టేజ్‌ పైకి రా” అంటూ ఆది పిలవగానే ఒక అమ్మాయి నవ్వులు చిందిస్తూ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆమె పేరు ‘విహారిక’.

Hyper Aadi Girl Friend: జబర్దస్త్ హైపర్ ఆది గర్ల్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా? ఏకంగా టీవీ షోలో ప్రపోజ్‌ చేసిన ఆది, నిజమా? లేకపోతే ఇదికూడా స్క్రిప్ట్‌ లో భాగమా అంటూ ఫ్యాన్స్ ప్రశ్నలు
Hyper Aadi Girl Friend (PIC@ YOUTUBE)

Hyderabad, AUG 16: జబర్దస్త్ (Jabardasth) షో ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయిన కమెడియన్ ‘హైపర్ ఆది’. తన పంచ్‌లు, కామెడీ టైమింగ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫేమ్ తో ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాల్లో నటిస్తూ కెరీర్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు. కాగా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్, ఆది పెళ్లి విషయం పై ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తుంటారు. కానీ వారిద్దరూ మాత్రం ఇప్పటివరకు పెళ్లి కాదు కదా ప్రేమ అనే మాట కూడా బయట పెట్టడంలేదు. అయితే ఈ సైలెన్స్ కి ఆది బ్రేక్ వేసినట్లు తెలుస్తుంది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో హైపర్ ఆది తన ప్రియురాలిని పరిచయం చేశాడు. ఆ ప్రోమోలో ఆది మాట్లాడుతూ.. “స్క్రిప్ట్ లో భాగంగా ఇప్పటికి చాలామందికి లైన్ వేసి, ప్రపోజల్స్ కూడా చెప్పను. కానీ నేను నిజంగా ప్రేమించిన అమ్మాయి ఒకరు ఉన్నారు. బేబీ ఒక్కసారి స్టేజ్‌ పైకి రా” అంటూ ఆది పిలవగానే ఒక అమ్మాయి నవ్వులు చిందిస్తూ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆమె పేరు ‘విహారిక’.

అదే స్టేజి పై ఆది విహారికకు ఐ లవ్‌ యూ అంటూ ప్రపోజ్‌ చేశాడు. ఆ తరువాత ఒకరి బుగ్గలను ఒకరు ముద్దాడుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన కొంతమంది నెటిజెన్స్.. ఇది కూడా స్క్రిప్ట్ లో భాగమే అయ్యి ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ఆమెను ఏ టీవీ షోల్లో చూడలేదు. నిజంగా ఆమె ఆది ప్రియురాలే అయ్యి ఉంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆమె నిజంగానే ఆది ప్రియురాలా? కాదా? అనేది తెలియాలంటే ఈవారం షో చూసి తెలుసుకోవాల్సిందే.

(The above story first appeared on LatestLY on Aug 16, 2023 10:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).