Delhi Shocker: చనిపోయిన తండ్రిని బ్రతికించుకునేందుకు రెండు నెలల చిన్నారిని నరబలి ఇచ్చే యత్నం, పోలీసుల రంగ ప్రవేశంతో ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి, ఢిల్లీలో విస్తుపోయే ఘటన
కిడ్నాప్ చేసిన మహిళను శ్వేత (25)గా గుర్తించారు. కిడ్నాప్ ఎందుకు చేసింది అనే విషయాలు విచారించగా పోలీసులు షాకింగ్‌కు గురయ్యే నిజం తెలిసింది. శ్వేతకు (Sweatha)ఎక్కువ. చిన్నారిని బలి ఇస్తే చనిపోయిన తన తండ్రి బతుకుతాడని నమ్మింది. దీంతో తండ్రిని తిరిగి బతికించేందుకు పాపను బలివ్వాలనుకుంది.
New Delhi, NOV 12: ఢిల్లీలో (Delhi) ఒక మహిళ దారుణానికి ఒడిగట్టింది. చనిపోయిన తండ్రిని బతికించేందుకు రెండు నెలల చిన్నారిని నరబలి (human sacrifice ritual) ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఇందుకోసం చిన్నారిని కిడ్నాప్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని పోలీసులు మీడియాకు వెల్లడించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. గత గురువారం ఢిల్లీలోని గర్హి ప్రాంతానికి చెందిన రెండు నెలల చిన్నారి కిడ్నాప్‌నకు (Kidnap) గురైంది. సఫ్దర్‌గంజ్ ఆసుపత్రిలో చిన్నారి, పాప తల్లిదండ్రులు కలిసి ఉండగా ఒక మహిళ అక్కడికి వచ్చి పరిచయం చేసుకుంది. తాను ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చినట్లు, చిన్నారుల పెంపకం గురించి వివరించి చెప్పింది. అదే రోజు ఆ చిన్నారిని ఎత్తుకెళ్లిపోయింది. దీంతో పాప తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
24 గంటల్లోనే కిడ్నాప్ కేసును చేధించారు. కిడ్నాప్ చేసిన మహిళను శ్వేత (25)గా గుర్తించారు. కిడ్నాప్ ఎందుకు చేసింది అనే విషయాలు విచారించగా పోలీసులు షాకింగ్‌కు గురయ్యే నిజం తెలిసింది. శ్వేతకు (Sweatha)ఎక్కువ. చిన్నారిని బలి ఇస్తే చనిపోయిన తన తండ్రి బతుకుతాడని నమ్మింది. దీంతో తండ్రిని తిరిగి బతికించేందుకు పాపను బలివ్వాలనుకుంది. ఇందుకోసమే రెండు నెలల చిన్నారిని కిడ్నాప్ చేసింది. ప్రస్తుతం పోలీసులు శ్వేతను అరెస్టు చేసి, జైలుకు తరలించారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.
(The above story first appeared on LatestLY on Nov 12, 2022 06:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

