Andhra Pradesh: ఏపీలో మే 9 నుంచి వేసవి సెలవులు, వచ్చే విద్యా సంవత్సరం జూలై 4 నుంచి ప్రారంభం, ఉత్తర్వులు జారీ చేసిన విద్యా శాఖ
ఏపీలో పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు మే 9 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం జూలై 4 నుంచి మొదలు కానుంది. ఈ మేరకు శనివారం ఏపీ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని విద్యార్థులకు మే 9 నుంచి వేసవి సెలవులు (AP School Summer Holidays 2022) మొదలు కానున్నాయి.
ఏపీలో పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు మే 9 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం జూలై 4 నుంచి మొదలు కానుంది. ఈ మేరకు శనివారం ఏపీ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని విద్యార్థులకు మే 9 నుంచి వేసవి సెలవులు (AP School Summer Holidays 2022) మొదలు కానున్నాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అమ్మ ఒడిపై ఎలాంటి ఆంక్షలు లేవు, టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది, ఆధారాలు ఉంటే చూపించాలని మండిపడిన ఏపీ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేశ్
ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు ఈ నెల 27 నుంచి మే 9 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తవగానే సమ్మర్ హాలీడేస్ (Summer holidays) ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్-2 పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 4 వరకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలు పూర్తి కాగానే వారికి వేసవి సెలవులు ప్రకటించనున్నారు. వేసవి సెలవుల అనంతరం జులై 4 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఏపీలోని జూనియర్ కాలేజీలకు మే 25 నుంచి జూన్ 20 వరకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.
(The above story first appeared on LatestLY on Apr 15, 2022 08:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

