CBSE Board Exams 2021 Update: సీబీఎస్‌ఈ పదవ తరగతి పరీక్షలు రద్దు, 12వ తరగతి ఎగ్జామ్స్ వాయిదా, విద్యార్థుల ప్రతిభ, పనితీరు ఆధారంగా వారికి మార్కులు కేటాయిస్తామని తెలిపిన కేంద్ర విద్యాశాఖ
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను రద్దు (Class 10 Exams Cancelled) చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల ప్రతిభ, పనితీరు ఆధారంగా వారికి మార్కులు కేటాయిస్తామని వెల్లడించింది. 12వ తరగతి పరీక్షలు మాత్రం వాయిదా (Class 12 Examinations Postponed) వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు.
New Delhi, April 14: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను రద్దు (Class 10 Exams Cancelled) చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల ప్రతిభ, పనితీరు ఆధారంగా వారికి మార్కులు కేటాయిస్తామని వెల్లడించింది. 12వ తరగతి పరీక్షలు మాత్రం వాయిదా (Class 12 Examinations Postponed) వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలను (CBSE Board Exams 2021 Update) రద్దు చేయాలంటూ కేంద్రంపై తీవ్ర ఒత్తిడి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెల 4 నుంచి జరగాల్సిన పరీక్షలపై చర్చించేందుకు ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ( Ramesh Pokhriyal Nishank), ఇతర సీనియర్ అధికారులు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై చర్చించారు. అనంతరం టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మే 4 నుంచి జూన్ 7 వరకు జరగాల్సిన సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నాం. బోర్డు తయారు చేసే ఆబ్జెక్టివ్, క్రైటీరియా ఆధారంగా విద్యార్థుల పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తాం. ప్రస్తుతానికి 12వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నాం. జూన్ 1న పరిస్థితిని సమీక్షించిన తర్వాత 12వ తరగతి ఎగ్జామ్స్‌పై నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ పరీక్షలు పెట్టాలనుకుంటే 15 రోజుల ముందుగానే వాటి వివరాలు ప్రకటిస్తాం" అని తెలిపారు.
కరోనాను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. విద్యార్థుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని మోదీ చెప్పారని ఈ భేటీకి హాజరైన విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. అనంతరం టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని వివరాల కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.nic.inను వీక్షించండి.
ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తదితరులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు సీబీఎస్ఈ విద్యార్ధులు సైతం బోర్డు పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఆన్‌లైన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. పరీక్షల రద్దు కోసం పెట్టిన ఆన్‌లైన్ పిటిషన్‌పై 2 లక్షల మందికి పైగా విద్యార్థులు సంతకాలు చేశారు.
(The above story first appeared on LatestLY on Apr 14, 2021 03:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

