Inter First Year Online Classes: జూన్‌ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు, జూలై 5వ తేదీతో తెలంగాణలో ముగియనున్న ఆన్‌లైన్‌ ప్రవేశాలు, పరిస్థితిని బట్టి రెండో విడుత ప్రవేశాలకు అవకాశం

ఇటీవలే ఉత్తీర్ణులైన పదోతరగతి విద్యార్థులకు తెలంగాణ ఇంటర్‌బోర్డు (TS Inter Board) శుభవార్త చెప్పింది. 2021-22 సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు (Inter First Year Online Classes) షెడ్యూల్‌ విడుదలచేసింది. జూన్‌ ఒకటో తేదీ నుంచి ఇంటర్ ఫస్టియర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.

Inter First Year Online Classes: జూన్‌ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు, జూలై 5వ తేదీతో తెలంగాణలో ముగియనున్న ఆన్‌లైన్‌ ప్రవేశాలు, పరిస్థితిని బట్టి రెండో విడుత ప్రవేశాలకు అవకాశం
Representational Image (Photo Credits: PTI)

ఇటీవలే ఉత్తీర్ణులైన పదోతరగతి విద్యార్థులకు తెలంగాణ ఇంటర్‌బోర్డు (TS Inter Board) శుభవార్త చెప్పింది. 2021-22 సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు (Inter First Year Online Classes) షెడ్యూల్‌ విడుదలచేసింది. జూన్‌ ఒకటో తేదీ నుంచి ఇంటర్ ఫస్టియర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ మంగళవారం ప్రకటన విడుదలచేశారు. మొదటి విడుత ఫస్టియర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలు మంగళవారం నుంచే ప్రారంభించినట్టు వెల్లడించారు. ఈ ప్రవేశాల ప్రక్రియ జూలై 5వ తేదీతో ముగుస్తుంది.

ఇది మొదటి విడుత ప్రవేశాల షెడ్యూల్‌ మాత్రమే నని, పరిస్థితిని బట్టి రెండో విడుత ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఎస్సెస్సీ విద్యార్థుల ఇంటర్నెట్‌ మెమోల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించిన ఆయన, ఎస్సెస్సీ ఒరిజినల్‌ మెమోలు, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్లు సమర్పించిన తర్వాతే ప్రొవిజినల్‌ అడ్మిషన్లను ఆమోదిస్తామని స్పష్టంచేశారు. ఇతర వివరాల కోసం TSBIE/ acadtsbie. cgg. gov.in / tsbie.cgg.gov.in వెబ్‌సైట్లను సంప్రదించాలని సూచించారు.

రెండు పద్ధతుల్లో సీబీఎస్‌ఈ పరీక్షలు, పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపిన బోర్డు, పరీక్షలు నిర్వహణపై భేటీ అయిన కేంద్ర మంత్రుల కమిటీ

ఏటా జూన్‌ 1 నుంచే ఇంటర్‌ కాలేజీలు ప్రారంభవుతుండగా, గతేడాది కరోనా నేపథ్యంలో సెప్టెంబర్‌ నుంచి ఆన్‌లైన్‌ క్లాసులను ప్రారంభించారు. ఈ ఏడాది విద్యార్థులు నష్టపోకుండా జూన్‌ 1 నుంచే ఆన్‌లైన్‌ క్లాసులతోపాటు, మంగళవారం నుంచే ప్రవేశాలు ప్రారంభించారు. సెకండియర్‌ ఆన్‌లైన్‌ క్లాసులపై నిర్ణయం తీసుకోలేదని, పరిస్థితిని బట్టి ప్రారంభిస్తామని జలీల్‌ వెల్లడించారు. టెన్త్‌ పాసైన విద్యార్థులు ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు, కో ఆపరేటివ్‌, తెలంగాణ రెసిడెన్షియల్‌, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌, ఇంటెన్సివ్‌, మైనార్టీ గురుకులాలు, కేజీబీవీలు, టీఎస్‌ మోడల్‌ జూనియర్‌ కాలేజీలు, కాంపొజిట్‌ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు.

మార్గదర్శకాలు..

ప్రవేశాల్లో రిజర్వేషన్లను కచ్చితంగా పాటించాలి. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 29%, వికలాంగులకు 3%, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కు 5%, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటాలో 3% చొప్పున సీట్లను భర్తీచేస్తారు. బాలికలకు ప్రత్యేక కాలేజీ లేని పక్షంలో 33.33% లేదా 1/3 సీట్లను వారికి కేటాయించేలా ప్రిన్సిపాళ్లు చర్యలు తీసుకోవాలి.

ఎస్సెస్సీ జీపీఏ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకోసం కాలేజీలు ఎలాంటి ప్రవేశ పరీక్షలను నిర్వహించరాదు. ఒక వేళ నిర్వహిస్తే సదరు కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటారు.

ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలన్నింటిలో ప్రవేశాలు పొందే విద్యార్థులు తమ ఆధార్‌ నంబర్‌ను సమర్పించాలి.

ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు తమకు మంజూరైన సీట్లకు మించి ప్రవేశాలు కల్పించరాదు. ఒక్కో సెక్షన్‌కు 88 మంది మించకుండా చూసుకోవాలి. అంతేకాకుండా అదనపు సెక్షన్లు మంజూరైన తర్వాతే చేర్చుకోవాలి. బోర్డు ఉపసంహరించుకున్న కోర్సు కాంబినేషన్లలో అడ్మిషన్లు తీసుకోరాదు.

ప్రవేశాల సమయంలో కాలేజీలు తమకు మంజూరైన సెక్షన్లు, ఒక్కో సెక్షన్‌లో ఖాళీగా ఉన్న సీట్ల సంఖ్యను ప్రదర్శించడంతోపాటు, రోజువారీగా ఖాళీ సీట్ల సంఖ్యను అప్‌డేట్‌ చేయాలి.

జోగినిల పిల్లలకు ప్రవేశాలు కల్పించేటప్పుడు తండ్రి పేరు స్థానంలో తల్లిపేరు రికార్డుల్లో ఉంటే అదే పేరును కొనసాగించవచ్చు.

విద్యార్థులు ఆలస్యంగా ప్రవేశాలు తీసుకుంటే ఆయా వ్యవధికిగాను తాసిల్దార్‌ నుంచి లోకల్‌ క్యాండిడేట్‌/ రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ ఫర్‌ గ్యాప్‌ను సమర్పించాలి.

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్ణయం హర్షణీయం

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంటర్‌ అడ్మిషన్లు, ఆన్‌లైన్‌ క్లాసులను ప్రారంభించడం పట్ల పలు సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. జూన్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణకు చర్యలు తీసుకోవడం శుభసూచకమని పేర్కొన్నాయి. విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి, ఇంటర్‌ విద్య కమిషనర్‌ జలీల్‌కు ఆర్జేడీ కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సంఘం అధ్యక్షప్రధాన కార్యదర్శులు గాదే వెంకన్న, కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.

(The above story first appeared on LatestLY on May 26, 2021 01:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).