AP LAWCET Results 2023 Declared: ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల, 13,402మంది క్వాలిఫై, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి
ఏపీ లాసెట్(AP LAW CET), పీజీ ఎల్‌సెట్(PG LCET) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు
ఏపీ లాసెట్(AP LAW CET), పీజీ ఎల్‌సెట్(PG LCET) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఏపీలో న్యాయ కళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ(LLB), రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం(LLM) కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 20న ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షలకు మొత్తం 16,203మంది హాజరు కాగా.. వారిలో 13,402మంది క్వాలిఫై అయినట్టు వీసీ వెల్లడించారు.
ఏపీ పీఈసెట్ ఫలితాలు విడుదల, మొత్తం 977 మంది ఉత్తీర్ణత, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదిగో..
మూడేళ్ల బీఎల్/ఎల్‌ఎల్‌బీ: లాసెట్‌లో కొవ్వూరు హర్షవర్దన్ రాజు ఫస్ట్ ర్యాంకులో నిలవగా..లాసెట్‌లో ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష రాసిన వారిలో విశాఖకు చెందిన మరుపల్లి రమేశ్ టాపర్ గా నిలిచారు. లాసెట్‌లో రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో రవీంద్రబాబు (ఎన్టీఆర్ జిల్లా) టాపర్ గా నిలిచారు. ఫలితాల కోసం లింక్ క్లిక్ చేయండి
https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx
టాప్ ర్యాంకర్లు వీరే..
మూడేళ్ల బీఎల్/ఎల్‌ఎల్‌బీ టాపర్లు
లాసెట్‌లో కొవ్వూరు హర్షవర్దన్ రాజు ఫస్ట్ ర్యాంకులో నిలవగా.. ఆ తర్వాతి ర్యాంకుల్లో గంగాధర్ కునపులి (ప్రకాశం జిల్లా), పితాని సందీప్ (కోనసీమ), అంబటి సత్యనారాయణ (ఏలూరు), పొల్లకట్ల లోకేశ్ (వైఎస్‌ఆర్ కడప), భవసాగర్ (నెల్లూరు), పుట్టా వీవీ సతీశ్ బాబు (కాకినాడ), దాసరి మెహర్ హేమంత్ (కృష్ణా), కోదండపాణి (బాపట్ల), కె.రాజశేఖర్ రెడ్డి (నంద్యాల) తర్వాత పది ర్యాంకుల్లో మెరిశారు.
ఐదేళ్ల బీఎల్/ఎల్‌ఎల్‌బీలో టాపర్లు
లాసెట్‌లో ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష రాసిన వారిలో మరుపల్లి రమేశ్ (విశాఖ), చెన్నుపాటి లిఖిత (గుంటూరు), అలతుర్తి రవీంద్ర చారి (ప్రకాశం), ఎన్.నరసింహ (అనకాపల్లి), మైలపల్లి సాగర్ (అనకాపల్లి), కొండవీటి ఎలిజిబెత్ గ్రేస్ (ఎన్టీఆర్ జిల్లా), ఓం కారం వెంకట బిందు ( (నెల్లూరు), గంజి దేవిశ్రీ నీల (బాపట్ల), సాధ్విక్ వేముల (కరీంనగర్), దామల శ్రీహరి (నంద్యాల) టాపర్లుగా నిలిచారు.
రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం టాపర్లు
లాసెట్‌లో రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో రవీంద్రబాబు (ఎన్టీఆర్ జిల్లా), సాయి నాగ శ్రీబాల (ఏలూరు), సాది సింధుజ రెడ్డి (విశాఖపట్నం), మజ్జి వంశీకృష్ణ (శ్రీకాకుళం), లలితశ్రీ (విశాఖపట్నం), రఘునాథ్ పోపూరి (గుంటూరు), పవన్ కుమార్ కోసూరి (గుంటూరు), యంపటి శిరీషా రెడ్డి (గుంటూరు), ముప్పాళ్ల సుప్రియ (పల్నాడు), సత్యప్రసాద్ జంపా(అనకాపల్లి) టాపర్లుగా మెరిశారు.
(The above story first appeared on LatestLY on Jun 16, 2023 06:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

