
ఏపీలో పీఈటీ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 31న నిర్వహించిన ఏపీ పీఈసెట్ (AP PECET) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ విడుదల చేశారు. ఈ సెట్‌లో మొత్తం 977 మంది ఉత్తీర్ణత సాధించినట్టు ఆయన వెల్లడించారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మౌనిక తొలి ర్యాంకు సాధించగా.. అనంతపురం జిల్లా ఎర్రగుంట వాసి లక్ష్మీదేవికి రెండో ర్యాంకు, ప్రకాశం జిల్లా వాసి షేక్ మహ్మద్‌కు మూడో ర్యాంకు వచ్చినట్లు తెలిపారు. ఫలితాల కోసం కింది లింక్ క్లిక్ చేయండి.
https://cets.apsche.ap.gov.in/PECET/PECET/PECET_Get_Rank_Card.aspx
