TS Inter Results 2023: మే రెండో వారంలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా రిజల్ట్స్ విడుదల చేయాలని కసరత్తు చేస్తున్న ఇంటర్‌ బోర్డు

తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. మరో మూడు నాలుగు రోజుల్లో ఫలితాల వెల్లడి తేదీని అధికారికంగా ప్రకటించే వీలుందని బోర్డుకు సంబంధించిన ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. మే రెండో వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితాలు వెల్లడించాలనే పట్టుదలతో అధికారులున్నట్లు సమాచారం.

TS Inter Results 2023: మే రెండో వారంలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా రిజల్ట్స్ విడుదల చేయాలని కసరత్తు చేస్తున్న ఇంటర్‌ బోర్డు
Representational Image (File Photo)

తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. మరో మూడు నాలుగు రోజుల్లో ఫలితాల వెల్లడి తేదీని అధికారికంగా ప్రకటించే వీలుందని బోర్డుకు సంబంధించిన ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. మే రెండో వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితాలు వెల్లడించాలనే పట్టుదలతో అధికారులున్నట్లు సమాచారం. కాగా ఎలాంటి తప్పులు, సమస్యలకు తావివ్వకుండా ఈసారి ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది.

విద్యార్థులకు మరో అవకాశం, నేటి నుంచి ఇంటర్ ఫలితాల రీకౌంటింగ్‌, మార్కులు తక్కువ వస్తే రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు

ఫలితాల వెల్లడి ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ బుధవారం పరీక్షల విభాగం అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. స్పాట్‌ వ్యాల్యుయేషన్, మార్కుల క్రోడీకరణ, డీ కోడింగ్‌ ప్రక్రియ, ఆన్‌లైన్‌లో మార్కుల నమోదు విధానాలపై చర్చించారు. ఫలితాల వెల్లడికి అవసరమైతే కొంత సమయం తీసుకోవడానికైనా వెనుకాడవద్దని, అన్ని స్థాయిల్లో పరిశీలించిన తర్వాతే ముందుకెళ్ళాలని అధికారులకు మిత్తల్‌ సూచించారు. సాఫ్ట్‌వేర్‌ను పూర్తిస్థాయిలో నిపుణుల చేత పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, రీవెరిఫికేషన్ కి మే 6 లోపు అప్లై చేసుకోవాలని తెలిపిన మంత్రి బొత్స

ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షకు సంబంధించి దాదాపు 9 లక్షల మంది ఈసారి పరీక్ష రాశారు. ఇంతమంది మార్కుల నమోదు విషయంలో ప్రత్యేక పరిశీలనకు అధికారులను నియమించారు. అంతిమంగా అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఫలితాల వెల్లడికి సిద్ధమవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఫలితాల వెల్లడి తర్వాత ఎక్కడైనా తప్పు జరిగిందని భావిస్తే, మార్కులను మాన్యువల్‌గా తెప్పించి చూడటం ఆలస్యమవ్వొచ్చు. దీన్ని దృష్టి లో ఉంచుకుని ఆన్‌లైన్‌లో వీలైనంత త్వరగా విద్యార్థి రాసిన పేపర్‌ను పరిశీలించే ఏర్పాట్లు చేయాలని, ఏ ఒక్క విద్యార్థి కూడా అధైర్యపడకుండా చర్యలు తీసుకోవాలని మిత్తల్‌ సూచించారు

(The above story first appeared on LatestLY on Apr 27, 2023 11:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).