TSPSC Group 2 Exam 2023: గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్, తెలంగాణలో ఆగస్టు 29,30న గ్రూప్-2 పరీక్షలు, పరీక్షకు వారం ముందు నుంచే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్
గ్రూప్-2 పరీక్షా తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం ప్రకటించింది.ఆగస్టు 29,30న గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు వారం ముందు నుంచే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) వెల్లడించింది.

783 పోస్టుల కోసం గతేడాది డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. జనవరి 18 నుంచి దరఖాస్తులు స్వీకరించింది. గ్రూప్-2 ఉద్యోగాల కోసం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 705 మంది దరఖాస్తు చేసుకున్నారు.చివరి మూడు రోజుల్లోనే 1.10లక్షల దరఖాస్తులు వచ్చాయి.
(The above story first appeared on LatestLY on Feb 28, 2023 09:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).