Representative Image (Photo Credit: PTI)

విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న టీఎస్ ఐసెట్ -2023 షెడ్యూల్‌ విడుదల అయింది. తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి ఈ షెడ్యూల్ విడుద‌ల చేశారు. మార్చి 6వ తేదీ నుంచి మే 6 వ‌ర‌కు అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ. 550, మిగ‌తా వారు రూ. 750 చెల్లించి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫిబ్రవరి 28న తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్, మార్చి 3 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్, తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ

రూ. 250 ఆల‌స్య రుసుంతో మే 12వ తేదీ వ‌ర‌కు, రూ. 500 ఆల‌స్యం రుసుంతో మే 18 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను మే 12 నుంచి 18వ తేదీ మ‌ధ్య‌లో ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. మే 22 నుంచి అభ్య‌ర్థులు తమ హాల్ టికెట్ల‌ను డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. మే 26, 27 తేదీల్లో ఐసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.