Telangana EAMCET 2023: ఫిబ్రవరి 28న తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్, మార్చి 3 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్, తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ
Exams Representational Image. |(Photo Credits: PTI)

తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌ న్యూస్..తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదలయ్యింది. ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 3 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్వీకరణ ఉంటుంది.ఆన్‌లైన్ అప్లికేషన్ స్వీకరణకి చివరి తేదీ ఏప్రిల్ 30గా నిర్ణయించారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్‌, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఎంసెట్‌ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు.కాగా ఈ నెల 28న ఎంసెట్ తో పాటు పీజీ ఈ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.

తెలంగాణలో అన్నీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ పూర్తి వివరాలు ఇవిగో, మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్ష, మే 29 నుంచి జూన్‌1 వరకు పీజీఈసెట్‌ పరీక్షలు

ఏప్రిల్ 10 వరకు ఎంసెట్ దరఖాస్తుకు అవకాశం ఉండనుంది. పీజీ ఈ సెట్ కి ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉన్నట్లు తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. అలాగే, మే 7,8,9 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలు జరుగననున్నాయి. అలాగే, మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ ఎంట్రెన్స్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటన చేసింది.

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ వివరాలు ఇవే..

ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల

మార్చి 3 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్వీకరణ

ఆన్‌లైన్ అప్లికేషన్ స్వీకరణకి చివరి తేదీ ఏప్రిల్ 30

మే 2 నుండి 4 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం

250 రూపాయల లేట్ ఫీజుతో మే 5 వరకు అప్లై

1000 రూపాయల లేట్ ఫీజుతో మే10 వరకు దరఖాస్తు

2500 రూపాయల లేట్ ఫీజు తో మే 15 వరకు అప్లై చేసుకునే ఛాన్స్

5000 రూపాయల లేట్ ఫీజుతో మే 24 వరకు అప్లై చేసుకునే అవకాశం

మే 21వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో ఎంసెట్ హల్ టికెట్స్

మే 7,8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు

మే 7,8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు

ఉదయం 9 నుండి 12 వరకు మొదటి సెషన్ పరీక్ష,

మధ్యాహ్నం 3 నుండి 6 వరకు రెండవ సెషన్ పరీక్ష పరీక్ష

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 500 రూపాయలు

ఇతర విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 900 రూపాయలు