COVID-19 Outbreak in India | File Photo

New Delhi, May 16: 'ఇతర దేశాలతో పోలిస్తే' అని పోల్చుకోవడం, ఘనతలు చాటుకోవడం ఇకపై చెల్లవు. ఎందుకంటే దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా పెరగుతూ వచ్చి, ఈరోజు వైరస్ పుట్టుక కారణం అని చెప్పబడే చైనా దేశాన్ని సైతం భారత్ అధిగమించింది. కోవిడ్-19 తో తీవ్రంగా ప్రభావితమైన ప్రపంచ దేశాలలో భారత్ 11వ స్థానానికి చేరుకుంది.

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 3,970 పాజిటివ్ కేసులు మరియు 103 మరణాలు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య ఇప్పుడు 85,940 దాటింది. దీని ప్రకారం గ్లోబల్ రికార్డుల్లో చైనా యొక్క కోవిడ్-19 సంఖ్య 84,038 ను అధిగమించిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.

భారత్ లో తక్కువ మొత్తంలో వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తారనే విమర్శలు ఉండగా, 50 రోజుల లాక్డౌన్ అనంతరం కూడా అధికారిక గణాంకాల ప్రకారం కరోనా కేసులు 86 వేలకు చేరువవడం కొంత ఆందోళన కలిగించే విషయం. అయినప్పటికీ ఈ వైరస్ బారిన పడి కోలుకునే వారు ఎక్కువ సంఖ్యలో ఉండటం, మరణాల సంఖ్య తక్కువగా ఉండటం కొంత ఉపశమనం కలిగించే విషయం.

దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 30,153 బాధితులు కోలుకోని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవగా, ఇప్పటివరకు 2,752 మంది కరోనా, మరియు ఇతర అనారోగ్య కారణాలు కలిగి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 53,035 ఆక్టివ్ కేసులు ఉన్నాయని భారత వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇండియాలో రాష్ట్రాల వారీగా కోవిడ్-19 కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:

S. No. Name of State / UT Total Confirmed cases* Cured/Discharged/Migrated Deaths**
1 Andaman and Nicobar Islands 33 33 0
2 Andhra Pradesh 2307 1252 48
3 Arunachal Pradesh 1 1 0
4 Assam 90 41 2
5 Bihar 1018 438 7
6 Chandigarh 191 37 3
7 Chhattisgarh 66 56 0
8 Dadar Nagar Haveli 1 0 0
9 Delhi 8895 3518 123
10 Goa 15 7 0
11 Gujarat 9931 4035 606
12 Haryana 818 439 11
13 Himachal Pradesh 76 39 3
14 Jammu and Kashmir 1013 513 11
15 Jharkhand 203 87 3
16 Karnataka 1056 480 36
17 Kerala 576 492 4
18 Ladakh 43 22 0
19 Madhya Pradesh 4595 2283 239
20 Maharashtra 29100 6564 1068
21 Manipur 3 2 0
22 Meghalaya 13 11 1
23 Mizoram 1 1 0
24 Odisha 672 166 3
25 Puducherry 13 9 1
26 Punjab 1935 305 32
27 Rajasthan 4727 2677 125
28 Tamil Nadu 10108 2599 71
29 Telangana 1454 959 34
30 Tripura 156 42 0
31 Uttarakhand 82 51 1
32 Uttar Pradesh 4057 2165 95
33 West Bengal 2461 829 225
Cases being reassigned to states 230
Total number of confirmed cases in India 85940# 30153 2752

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు, మూడు లక్షలకు పైగా కోవిడ్-19 ద్వారా మరణించారు మరియు 45 లక్షలకు పైగా వ్యక్తులకు కరోనావైరస్ సోకినట్లు ఆయా దేశాలు ప్రకటించిన అధికారిక గణాంకాల ప్రకారం తెలుస్తుంది. ఇండియాకు వంద కోట్ల డాల‌ర్ల సాయం ప్రకటించిన ప్రపంచ బ్యాంకు

ప్రపంచంలో కోవిడ్-19 చేత అత్యధికంగా ప్రభావితమైన దేశంలో భారత్ ఇప్పుడు 11వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో యునైటెడ్ స్టేట్స్ 1,442,819 కేసులు మరియు 87,530 మరణాలతో మొదటి స్థానంలో ఉంది. 262,843 పాజిటివ్ కేసులతో రష్యా 2వ స్థానంలో, ఆ తరువాత స్థానాలలో వరుసగా యునైటెడ్ కింగ్డమ్ (238,004), స్పెయిన్ (230,183), ఇటలీ (223,885), బ్రెజిల్ (218,223), ఫ్రాన్స్ (179,630), జర్మనీ (175,233), టర్కీ (146,457) మరియు ఇరాన్ (116,635) దేశాలు ఉన్నాయి.