World Bank (Photo Credits: Wikimedia.org)

New Delhi, May 15: ప్ర‌పంచ బ్యాంకు కోవిడ్ 19తో పోరాడుతున్న ఇండియాకు భారీ సాయం ప్రకటన చేసింది. సోష‌ల్ ప్రొటెక్ష‌న్ ప్యాకేజీ కింద భార‌త్‌కు (India) సుమారు వంద కోట్ల డాల‌ర్లు ప్ర‌క‌టించింది. భార‌త ప్ర‌భుత్వం చేప‌డుతున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు ఈ ప్యాకేజీ లింకై ఉంటుంద‌ని ప్ర‌పంచ బ్యాంకు (World Bank) పేర్కొన్న‌ది.  రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ, రైతులు,వలస కూలీలు,చిన్న వ్యాపారులకు ప్యాకేజీ ద్వారా ఎంతో లబ్ది, 9 విభాగాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి

సోష‌ల్ ప్రొటెక్ష‌న్ ప‌థ‌కం (Social Protection Package) కింద ఆయా దేశాల‌కు వ‌ర‌ల్డ్ బ్యాంకు నిధుల‌ను స‌మాకూరుస్తున్న‌ది. దేశంలోని పట్టణ ప్రాంత పేదలు, వలస కార్మికుల సంక్షేమానికి ఈ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపింది. వలస కార్మికులకు 2 నెలలు ఉచిత భోజనం, 3 పూటల భోజనానికి రూ.3500 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, వివరాలను వెల్లడించిన ఆర్థిక మంత్రి సీతారామన్

కరోనా (COVID-19 Pandemic) అత్యవసర పరిస్థితి నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణ కోసం భారత్‌కు ప్రపంచ బ్యాంకు గతంలోనే ఒక బిలియన్‌ డాలర్ల సహాయానికి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అదనంగా మరో బిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. క్యాష్ ట్రాన్స‌ఫ‌ర్ల విధానం చాలా కీల‌క‌మైంద‌ని, దాని వ‌ల్ల జీవ‌ణ ప్ర‌మాణాలు చాలా వేగంగా, సులువుగా అభివృద్ధి చెందుతాయ‌ని వ‌ర‌ల్డ్ బ్యాంకు సోష‌ల్ ప్రొటెక్ష‌న్ గ్లోబ‌ల్ డైర‌క్ట‌ర్ మైఖేల్ రుట్కోస్కీ తెలిపారు. బ్ర‌త‌క‌డానికి ఇత‌ర మార్గాలు క‌ష్ట‌మైన‌ప్పుడు, ఇది సుల‌వైన విధానం అని ఆయ‌న తెలిపారు. రూ.లక్ష కోట్లతో రైతులకు ప్రత్యేక ప్యాకేజి, మూడో విడత ఆర్థిక ప్యాకేజీలో మొత్తం 11 అంశాలపై ప్రత్యేక దృష్టి, వెల్లడించిన కేంద్ర ఆర్థికమంత్రి

భార‌త ప్ర‌భుత్వంతో మూడు రంగాల్లో వ‌ర‌ల్డ్ బ్యాంక్ భాగ‌స్వామ్యం ఏర్పాటు చేసుకోనున్న‌ట్లు వ‌ర‌ల్డ్ బ్యాంక్ కంట్రీ డైర‌క్ట‌ర్ జునైద్ అహ్మ‌ద్ తెలిపారు. ఆరోగ్యం, సామాజిక సంర‌క్ష‌ణ‌, చిన్న‌మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల కోసం ఆ నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న 400కు పైగా సామాజిక భద్రతా పథకాలను సాంకేతికంగా ఏకీకృతం చేసే దిశగా ఈ నిధులను వినియోగించాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.  ప్రధాని మోదీ 'ఆత్మ నిర్భర్' గుట్టు విప్పిన కేంద్ర ఆర్థికమంత్రి, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అంటే స్వయం ఆధారిత భారతం, ఉద్దీపన ప్యాకేజీ వివరాలు వెల్లడించిన నిర్మలా సీతారామన్

భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు 81,970కు చేరుకున్నాయి.మ‌ర‌ణించిన వారి సంఖ్య 2649కు చేర‌కున్న‌ది. లాక్‌డౌన్ వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన్న నేప‌థ్యంలో .. కొన్ని రోజుల క్రితం ప్ర‌ధాని మోదీ 20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి, చిన్నాభిన్నమైన పేద కుటుంబాలకు అండగా నిలవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన ‘ఆత్మ నిర్భర అభియాన్ భారత్’ పథకంపై ప్రపంచ బ్యాంకు ప్రశంసలు కురిపించింది. కాగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు 44 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 3 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు.