Coronavirus in India: తగ్గుతున్న కరోనా తీవ్రత, 1 శాతానికి చేరిన డైలీ పాజిటివిటీ రేటు, ఊరట కలిగిస్తున్న యాక్టీవ్ కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్ లో దూసుకుపోతున్న భారత్
భారత్ లో కరోనా క్రమంగా తీవ్రత తగ్గుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు తగ్గతున్నాయి. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 11,499 కరోనా కేసులు (Daily Corona cases) నమోదయ్యాయి. శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి 255 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,13,481 కి చేరింది.
New Delhi Feb 26: భారత్ లో కరోనా క్రమంగా తీవ్రత తగ్గుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు తగ్గతున్నాయి. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 11,499 కరోనా కేసులు (Daily Corona cases) నమోదయ్యాయి. శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి 255 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,13,481 కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది. నిన్న ఒక్కరోజే 23,598 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య (Corona (Active cases) కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,21,881 యాక్టీవ్ కేసులున్నాయి. అటు రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు (Daily positivity rate) భారీగా తగ్గింది. ప్రస్తుతం 1.01% శాతంగా ఉంది.
India reports 11,499 fresh #COVID19 cases, 23,598 recoveries, and 255 deaths in the last 24 hours.
Active case: 1,21,881 (0.28%)
Daily positivity rate: 1.01%
Total recoveries: 4,22,70,482
Death toll: 5,13,481
Total vaccination: 1,77,17,68,379 pic.twitter.com/IW6KWWFjdr
— ANI (@ANI) February 26, 2022
కేరళతో పాటూ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కూడా కరోనా తీవ్రత తగ్గుతోంది.అటు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు 1,77,17,68,3796 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయినట్లు కేంద్రం ప్రకటించింది. యువజనుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.
Corona in AP: ఏపీలో కొత్తగా 280 మందికి కరోనా, 4,709 మందికి ఇంకా కొనసాగుతున్న చికిత్స
(The above story first appeared on LatestLY on Feb 26, 2022 09:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

