APPSC Group-1: జనవరి 28వ తేదీ అర్ధరాత్రి వరకు ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1 పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగింపు, మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష
APPSC Logo(Photo-File Image)

APPSC Group-1 Exam Application Deadline Extension: ఏపీలో గ్రూప్‌- 1 ఉద్యోగాలకు దరఖాస్తుల గడువును ఏపీపీఎస్సీ పొడిగించింది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్‌- 1 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ఈనెల 21తో ముగిసిన విషయం తెలిసిందే. అయితే, గ్రూప్‌-1 అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు దరఖాస్తుల గడువును పొడిగించాలని APPSC నిర్ణయించింది. గుడ్ న్యూస్, APPSC గ్రూప్‌ -2 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు, జనవరి 17 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచన

అర్హులైన అభ్యర్థులు జనవరి 28వ తేదీ అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌ https://psc.ap.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది. మరోసారి ఈ గడువును పొడిగించబోమని స్పష్టంచేసింది. ప్రిలిమినరీ పరీక్ష మార్చి 17న జరుగుతుందని.. ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టంచేసింది.