APPSC Group 2 Recruitment 2024: గుడ్ న్యూస్, APPSC గ్రూప్‌ -2 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు, జనవరి 17 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచన

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ -2 ఉద్యోగాల భర్తీకి గడువును మరో వారం రోజుల పాటు అంటే జనవరి 17 వరకు పొడిగించారు. అభ్యర్థుల కోరిక మేరకు గడువును ఈనెల 17 వరకు పొడిగిస్తున్నట్లు (APPSC Group 2 Application Date Extended 2024) ఏపీపీఎస్సీ(APPSC) అధికారులు వెల్లడించారు

APPSC Group 2 Recruitment 2024: గుడ్ న్యూస్, APPSC గ్రూప్‌ -2 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు, జనవరి 17 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచన
APPSC Logo(Photo-File Image)

APPSC Group 2 Application Date Extended 2024: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ -2 ఉద్యోగాల భర్తీకి గడువును మరో వారం రోజుల పాటు అంటే జనవరి 17 వరకు పొడిగించారు. అభ్యర్థుల కోరిక మేరకు గడువును ఈనెల 17 వరకు పొడిగిస్తున్నట్లు (APPSC Group 2 Application Date Extended 2024) ఏపీపీఎస్సీ(APPSC) అధికారులు వెల్లడించారు. గ్రూప్‌- 2 (Group -2) పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలో సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాటిని సరిచేయాలని అభ్యర్థులు కమిషన్‌కు విన్నవించారు.

దీంతో ఈనెల 10 వరకు ఉన్న గడువును జనవరి 17 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.అయితే ఫిబ్రవరి 25న జరిగే ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని కమిషన్‌ స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం 897 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్‌ గత డిసెంబర్‌లో విడుదల చేసింది.

విద్యార్థులకు అలర్ట్, సీబీఎస్‌ఈ పరీక్షల తేదీల్లో మార్పులు, ఎగ్జామ్స్ కొత్త టైం టేబుల్ ఇదిగో..

ఇందులో 331 ఎగ్జిక్యూటివ్‌, 566 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులున్నాయని తెలిపింది. డిసెంబర్‌ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలపగా.. అభ్యర్థుల ఇబ్బందుల దృష్ట్యా దరఖాస్తుల గడువును జనవరి 17వరకు పొడిగిస్తూ నిర్ణయం ప్రకటించారు. దరఖాస్తులు, ఇతర వివరాల కోసం https://psc.ap.gov.in/ క్లిక్‌ చేయండి.

(The above story first appeared on LatestLY on Jan 10, 2024 08:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).