NEET-UG 2024 Revised Results Out: నీట్ యూజీ-2024 తుది ఫలితాలు విడుదల, మీ రిజల్ట్స్‌ను exams.nta.ac.in ద్వారా చెక్ చేసుకోండి

నీట్ యూజీ-2024 తుది ఫలితాలను జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీయే) నేడు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు మేరకు సవరించిన ఫలితాలను నేడు నీట్ విడుదల చేసింది

NEET-UG 2024 Revised Results Out: నీట్ యూజీ-2024 తుది ఫలితాలు విడుదల, మీ రిజల్ట్స్‌ను exams.nta.ac.in ద్వారా చెక్ చేసుకోండి
Representational Image (File Photo)

New Delhi, july 25: నీట్ యూజీ-2024 తుది ఫలితాలను జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీయే) నేడు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు మేరకు సవరించిన ఫలితాలను నేడు నీట్ విడుదల చేసింది. భౌతికశాస్త్ర ప్రశ్నకు సంబంధించి పలువురు విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కును తొలగిస్తూ, తాజా ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు exams.nta.ac.in. వెబ్ సైట్ లో తాజా ఫలితాలను చూసుకోవచ్చు.  10వ తరగతి అర్హతతో రైల్వేలో 2,424 ఉద్యోగాలు, ఆగస్టు 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం, ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి

నీట్ యూజీ ప్రశ్నాపత్నంలో 29వ ప్రశ్నకు రెండు ఆప్షన్లు కరెక్ట్ అని నీట్ ఇటీవల పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ ఓ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించగా... ఢిల్లీ ఐఐటీ నిపుణుల కమిటీ నుంచి సూచనలు తీసుకున్న సుప్రీంకోర్టు... ఆప్షన్ 4ను టిక్ చేసిన వారికే మార్కులు ఇవ్వాలని తీర్పు వెలువరించింది. జూన్ 4నే నీట్ ఫలితాలు వెల్లడించడం తెలిసిందే. అందులో 67 మంది 720కి 720 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, వారిలో 44 మంది తమ ఫస్ట్ ర్యాంక్ ను కోల్పోయారు. కాగా ఈ ఏడాది నీట్ యూజీ ఎంట్రన్స్ పరీక్ష తీవ్ర వివాదాస్పదమైన సంగతి విదితమే.

NEET-UG 2024 సవరించిన ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి

exams.nta.ac.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

హోమ్‌పేజీ నుండి ఫలిత లింక్‌ను ఎంచుకోండి.

మీ ఫలితాన్ని యాక్సెస్ చేయడానికి, అవసరమైన లాగిన్ సమాచారాన్ని నమోదు చేయండి.

స్క్రీన్ ఇప్పుడు మీ ఫలితాన్ని ప్రదర్శిస్తుంది.

ప్రత్యేకతలను పరిశీలించండి

తర్వాత ఉపయోగం కోసం డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయండి.

(The above story first appeared on LatestLY on Jul 25, 2024 06:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).