South Central Railway: పెద్ద పండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నవారికి గుడ్ న్యూస్.. 20 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. పూర్తి వివరాలు ఇదిగో
పెద్ద పండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నవారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృ1ష్టిలో ఉంచుకొని 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
Hyderabad, Dec 22: పెద్ద పండుగ సంక్రాంతికి (Sankranti Festival) సొంతూళ్లకు (Home Towns) వెళ్లాలనుకుంటున్నవారికి దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 26 మధ్య హైదరాబాద్ –తిరుపతి, కాచిగూడ-కాకినాడ టౌన్ రూట్లలో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు వెల్లడించింది. స్లీపర్, జనరల్ బోగీలతోపాటు ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీతో నడపనున్న ఈ రైళ్ల వివరాలను తెలిపింది.
హైదరాబాద్ –తిరుపతి రూట్ వివరాలు
డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో తిరుపతి - హైదరాబాద్ రైలు (07510) ప్రయాణిస్తుంది. శుక్రవారం రాత్రి 8.15 గంటల ప్రయాణం మొదలై శనివారం ఉదయం 8.40 గంటలకు ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చుతుంది. డిసెంబర్ 29, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో హైదరాబాద్ - తిరుపతి రైలు (07509) సర్వీసు నడుస్తుంది. గురువారం రాత్రి 7.25 గంటలకు బయల్దేరి శుక్రవారం ఉదయం 8.20 గంటలకల్లా గమ్యస్థానం చేరుతుంది. హైదరాబాద్ -తిరుపతి- హైదరాబాద్ స్పెషల్ ట్రైన్స్ సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్నాయని ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది.
కాచిగూడ-కాకినాడ టౌన్ రూట్ వివరాలు
డిసెంబర్ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో (గురువారాలు) కాచిగూడ - కాకినాడ టౌన్ రైలు (07653) రాత్రి 8.30 గంటలకు బయలుదేరుతుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుతుంది. ఇక కాకినాడ టౌన్- కాచిగూడ రైలు (07654) డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. శుక్రవారం సాయంత్రం 5.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4.50 గంటలకు గమ్యస్థానానికి చేరుతుంది. కాచిగూడ-కాకినాడ టౌన్, కాకినాడ టౌన్-కాచిగూడ స్పెషల్ రైళ్లు మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్నాయి.
(The above story first appeared on LatestLY on Dec 22, 2023 06:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

