Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రద్దీ మార్గాల్లో ప్రత్యేక రైళ్ల ఏర్పాటు.. ఏఏ రూట్లలో ఏ సర్వీసు అంటే??
నిర్ణీత మార్గాల్లో ప్రయాణికుల రద్దీ అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Hyderabad, Dec 3: నిర్ణీత మార్గాల్లో ప్రయాణికుల రద్దీ (Passenger crowd) అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం డిమాండ్ (Demand) మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను (Special Trains) నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే (South Central Railway) అధికారులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రత్యేక రైళ్లు-వివరాలు
- ఈ నెల 13 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకు ప్రతి మంగళవారం షోలాపూర్ నుంచి ముంబయి ఎల్‌టీటీకి (01435)
- ఈ నెల 14 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు ప్రతి బుధవారం ముంబయి ఎల్‌టీటీ నుంచి షోలాపూర్‌కు (01436)
- ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 వరకు ప్రతి గురువారం షోలాపూర్ నుంచి తిరుపతి వరకు (01437)
- ఈ నెల 16 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 వరకు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి షోలాపూర్ వరకు (01438)
(The above story first appeared on LatestLY on Dec 03, 2022 08:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

