Hyderabad, DEC 02: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో (Delhi liquor policy case) సీబీఐ దూకుడు పెంచింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ నోటీసులు (CBI Notice) ఇచ్చింది. ఈనెల 6న ఉదయం 11గంటలకు విచారణ జరుపుతామని, హైదరాబాద్ లేదా ఢిల్లీలో ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలపాలని సీబీఐ నోటీసులో పేర్కొంది. అయితే సీబీఐ (CBI) నుంచి తనకు నోటీసులు అందినట్టు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ధ్రువీకరించారు. కేవలం తన వివరణ కోసమే నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఈనెల 6న హైదరాబాద్‌లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని సీబీఐకి తెలిపినట్టు కవిత ప్రకటించారు.
I have been issued a CBI Notice under section 160 of Cr.PC seeking my clarification. I have informed the authorities that I can meet them at my residence in Hyderabad on December 6 as per their request: K Kavitha, Telangana MLC, on receiving CBI notice regarding Delhi liquor scam
— ANI (@ANI) December 2, 2022
ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగస్వామ్యం/అనుమానం ఉన్న 36 మంది పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఆయనను ఈడీ అరెస్టు చేసింది. కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా రిమాండ్ రిపోర్టులో తెలంగాణ, ఏపీలకు చెందిన కల్వకుంట్ల కవిత, శరత్‌రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్, సృజన్‌రెడ్డి పేర్లు ఉన్నాయి.