Traffic Restrictions in Hyderabad: నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను (Telangana Formation day) ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని (Hyderabad) సెక్రటేరియట్ (Secretariat) పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు.
Hyderabad, June 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను (Telangana Formation day) ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని (Hyderabad) సెక్రటేరియట్ (Secretariat) పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. పలు రూట్లలో వాహనాలను దారిమళ్లించనున్నారు. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కును మూసేస్తారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని (Gun Park) అమరవీరుల స్తూపం వద్ద కూడా వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆ రూట్‌లో రాకపోకలు సాగించే వాహనాలను కొద్దిసేపు నిలిపివేయనున్నారు.
ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు
- వీవీ విగ్రహం, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి జంక్షన్ వరకు ఇరువైపులా ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పైకి వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద నుంచి సాదన్ కాలేజీ వైపు మళ్లిస్తారు. వీవీఐపీ రాకపోకల సందర్భంగా షాదాన్ కాలేజీ నుంచి సోమాజిగూడ రూట్‌లో ట్రాఫిక్‌ను కొన్ని నిమిషాల పాటు ఆపుతారు.
- ఇక్బాల్‌మినార్ జంక్షన్ నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వాహనాల అనుమతి ఉండదు. ఈ వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వద్ద మళ్లిస్తారు. అలాగే, తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి కట్టమైసమ్మ జంక్షన్, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.
- అఫ్టల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులు ట్యాంక్‌బండ్‌పై కాకుండా తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ ఆలయం, లోయర్ ట్యాంక్‌బండ్, కవాడిగూడ మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.
- ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్‌మార్గ్ కు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
- బీఆర్‌కేఆర్ భవన్ నుంచి ఎన్టీఆర్‌మార్గ్ రూట్‌లోకి వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
- బడాగణేశ్ లేన్ వైపు నుంచి ఐమాక్స్, నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కంపౌండ్ వెళ్లే వాహనాలను రాజ్‌దూత్ లేన్‌లోకి మళ్లిస్తారు.
- మింట్‌లేన్ నుంచి బడాగణేశ్ రూట్‌లో అనుమతించరు. ఈ వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.
(The above story first appeared on LatestLY on Jun 02, 2023 09:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

