Tips For Best Sex life: మీ ఏజ్ 30-40 మధ్య ఉంటే ఈ టిప్స్ మీ కోసమే, శృంగారం చేసే సామర్థ్యం ఉన్నా...చేయాలన్న కోరిక తగ్గినవారు  ఈ చిన్న చిట్కాలు పాటించండి చాలు
Sex (Photo Credits: The Noun Project and File)

Hyderabad December 19: వయస్సు మీద పడుతున్న కొద్దీ శృంగారం(SEX)పై ఆసక్తి సన్నగిల్లుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నడి వయస్కు స్త్రీలు, పురుషుల్లో ఎక్కువగా ఇటీవల వినిపిస్తున్న కంప్లయింట్ ఇదే. కొన్ని చిన్న చిన్న చిట్కాలు(TIPS) పాటిస్తే ఆలుమగలిద్దరూ ఏ వయస్సులో అయినా శృంగారాన్ని ఎంతో ఇష్టంగా ఆస్వాదించవచ్చు. శృంగారానికి కావాల్సినంత స‌మ‌యం(Time for sex life) కేటాయించాలి. శృంగార కోరిక‌లు స‌న్నగిల్లినా తిరిగి పెంచుకోవాలంటే కొన్ని చిన్న‌చిన్న చిట్కాలు పాటించాలి. మ‌రి ఆ చిట్కాలు ఏమిటో ఒక‌సారి తెలుసుకుందామా..?

జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకోవాలి(Remembering old days)

పిల్లలు పెరిగి పెద్ద‌య్యేస‌రికి దంప‌తులంద‌రి ఆలోచ‌నా తీరు ఒకేలా ఉంటుంది. పిల్లల భ‌విష్య‌త్తే వాళ్ల కండ్లముందు క‌ద‌లాడుతుంటుంది. దానికితోడు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా మొద‌ల‌వుతాయి. దాంతో శృంగారంప‌ట్ల(SEX) ఆస‌క్తి స‌న్న‌గిల్లుతుంది. ఇలా త‌గ్గిపోయిన ఆస‌క్తి మ‌ళ్లీ పెరుగాలంటే మాన‌సిక స‌న్న‌ద్ధ‌త చాలా ముఖ్యం. కాబ‌ట్టి అప్పుడ‌ప్పుడూ శృంగారం గురించిన ఆలోచ‌న‌లు చేస్తూ ఉండాలి. పెండ్ల‌యిన కొత్తలో శృంగారాన్ని ఎలా ఆస్వాదించేవాళ్లం, ఎలాంటి ఊసులు చెప్పుకునేవాళ్లం అనేవి గుర్తుచేసుకోవాలి. ఆ ఆలోచ‌న‌లు మ‌దిలో మెద‌ల‌గానే కోరిక‌లు గుర్రాల‌వ‌డం ఖాయం. దంప‌తులిద్ద‌రిలో ఒక్క‌రు ఇలా సిద్ధ‌మైతే చాలు.. అవ‌త‌లి వ్య‌క్తి అవ‌లీల‌గా ఆ దారిలోకి వ‌స్తారు.

ఫోర్ ప్లే చాలా ముఖ్యం(Foreplay Must)

చాలామంది శృంగారం అంటే ర‌తి కార్య‌మే అనుకుంటారు. కానీ ఆ కార్యానికి ముందు చేసే ఫోర్ ప్లే కూడా శృంగారంలో భాగ‌మే. భాగ‌స్వాములిద్ద‌రూ శృంగార అనుభూతుల‌ను ఆసాంతం అనుభ‌వించాలంటే ఫోర్ ప్లే చాలా ముఖ్యం. ఫోర్ ప్లే అనేది శృంగారంలో మంచి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఆలుమ‌గ‌ల మ‌ధ్య ప్రేమను మ‌రింత పెంచ‌డంలో ఈ ఫోర్ ప్లే దోహదపడుతుంది. ఎందుకంటే ఫోర్ ప్లే ఎక్కువ‌సేపు చేయ‌డంవ‌ల్ల ఆడ, మ‌గ ఇద్ద‌రిలో సెక్స్ హార్మోన్స్ పూర్తిగా విడుద‌ల‌వుతాయి. ఇలా హార్మోన్‌లు పూర్తిగా విడుద‌ల‌వ‌డంవ‌ల్ల శృంగారాన్ని సంపూర్ణంగా ఆస్వాదించ‌గ‌లుగుతారు. కాబ‌ట్టి ఎంత ఎక్కువ సేపు ఫోర్ ప్లే చేయ‌గ‌లిగితే అంత ఎక్కువ అనుభూతి చెంద‌వచ్చు.

చీక‌ట్లో శృంగారం క‌రెక్టు కాదు(Sex in Light)

దంప‌తుల్లో చాలామంది శృంగారం స‌మ‌యంలో లైట్లు బంద్ చేస్తారు. ఒక‌వేళ లైట్లు వేసివుంటే క‌ళ్లు మూసుకుంటారు. కానీ ఇలా చేయ‌డం కరెక్టు కాద‌ని సెక్సాల‌జిస్టులు చెబుతున్నారు. ఇలా ఒక‌రినొక‌రు చూసుకోకుండా శృంగారంలో పాల్గొంటే రానురాను శృంగారంప‌ట్ల ఆస‌క్తి త‌గ్గిపోతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. కాబ‌ట్టి శృంగారంలో పాల్గొనేట‌ప్పుడు లైట్లు వేసుకుని, ఒక‌రినొక‌రు కళ్లల్లో కళ్లుపెట్టి తేరిపారా చూసుకుంటే మంచి అనుభూతి క‌లుగుతుందంటున్నారు. ఇలా శృంగారంలో ఒక‌రినొక‌రు త‌నివితీరా చూసుకోవ‌డంవ‌ల్ల మ‌న‌సులో ఆ జ్ఞాప‌కాలు మ‌ధుర స్మృతులుగా మిగిలిపోతాయ‌ని, అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఆ స్మృతుల‌ను గుర్తుకు తెచ్చుకోగానే కోరిక‌లు పురివిప్పుతాయ‌ని సూచిస్తున్నారు.

Health Benefits of Sex: రోజూ సెక్స్‌లో పాల్గొంటే అనేక ప్రయోజనాలు, దంపతులు ప్రతి రోజూ శృంగారంలో పాల్గొంటే కలిగే లాభాలు, సెక్సాల‌జిస్టులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం

త‌ర‌చూ భంగిమ‌లు మార్చాలి(Change sex position)

ప‌ని ఏదైనా స‌రే ఎప్పుడూ ఒకేలా చేస్తూ పోతే బోర్ కొడుతుంది. శృంగారం కూడా అందుకు అతీత‌మైన‌ది ఏమీ కాదు. అందుకే త‌ర‌చూ శృంగార భంగిమ‌ల‌ను మార్చాలని సెక్సాల‌జిస్టులు స‌ల‌హా ఇస్తున్నారు. త‌ర‌చూ శృంగార భంగిమ‌ల‌ను మార్చ‌డం ద్వారా కొత్త‌కొత్త అనుభూతులు క‌లుగుతాయ‌ని, ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు నూత‌న అనుభూతుల‌ను ఆస్వాదించ‌డం ద్వారా శృంగారంపై కోరిక‌లు పెరుగుతాయ‌ని చెబుతున్నారు. ప్రాచీన గ్రంథం కామసూత్రలో శృంగారానికి సంబంధించి కావాల్సిన‌న్ని భంగిమ‌లు ఉన్నాయని, అయితే వ‌య‌సు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిలో అనువైన భంగిమ‌లను ఆస్వాదించ‌వ‌చ్చ‌ని నిపుణులు స్ప‌ష్టంచేస్తున్నారు.