Sex (Photo Credits: The Noun Project and File)

సాధార‌ణంగా శృంగారం వ‌ల్ల అనుభూతి, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం చేకూరుతాయనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే, వాటికి మించి ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా శృంగారం (Health Benefits of Sex) వ‌ల్ల క‌లుగుతాయ‌ని డాక్టర్లు చెబుతున్నారు. ప్ర‌తి రోజూ శృంగారంలో పాల్గొనే దంప‌తుల‌కు వైద్యుల అవ‌స‌ర‌మే రాద‌ని వారు చెబుతున్నారు. దంపతులు ప్రతి రోజూ శృంగారంలో పాల్గొంటే అనేక ప్రయోజనాలు (Sex Benefits) కలుగుతాయని సెక్సాల‌జిస్టులు చెబుతున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం.

రోజూ శృంగారంలో పాల్గొన‌డంవ‌ల్ల ఒత్తిడి దూరమై మెదడు చురుగ్గా పనిచేస్తుంద‌ని సెక్సాల‌జిస్టులు చెబుతున్నారు. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంద‌ట‌. ఎందుకంటే శృంగారంవ‌ల్ల సంతృప్తి మాత్ర‌మేగాక శరీరంలో యాంటీబాడీస్ సంఖ్య‌​ పెరుగుతుంద‌ట‌. శ‌రీరం వివిధ ర‌కాల వైర‌స్‌లు, బ్యాక్టీరియాల‌ను ఎదుర్కోవ‌డంలో శృంగారం బాగా తోడ్ప‌డుతుంద‌ట. అదేవిధంగా నిత్య శృంగారంవ‌ల్ల మహిళల శరీరంలో కండరాలు బలంగా తయారవుతాయట‌.

షుగర్ వ్యాధి ఉన్నవారు కోడిగుడ్లు తినవచ్చా, ఒకవేళ తింటే ఏమవుతుంది, వైద్య నిపుణులు ఏమి చెబుతున్నారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు గుడ్డు తింటే వారికి గుండె జబ్బుల ముప్పు ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం

యూరిన్​ లీకేజీ​ సమస్య ఉంటే త‌క్ష‌ణ‌మే త‌గ్గిపోతుంద‌ట‌.శృంగారం వ‌ల్ల గుండెపోటు రిస్క్​ కూడా తగ్గుతుందట‌. సాధారణంగా హార్మోన్‌లు బ్యాలెన్స్ త‌ప్ప‌డంవ‌ల్ల హార్ట్ఎటాక్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. శృంగారంవ‌ల్ల‌ శరీరంలో ఈస్ట్రోజన్​, టెస్టోస్టిరోన్​ లెవెల్స్​ సరిగ్గా ఉంటాయ‌ట‌. దాంతో గుండెపోటు ప్ర‌మాదం త‌గ్గుతుంద‌ట‌.

పెళ్లి తర్వాత పడక సుఖాన్ని చంపేస్తోన్న డయాబెటిస్, తగు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదంలో పడినట్లే, వైద్యులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం.

అంతేకాదు నిత్యం శృంగారంలో పాల్గొనే జంట‌ల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయ‌ట‌. ఏ ప‌ని చేసినా ఆత్మ‌విశ్వాసంతో చేస్తార‌ట‌. అదేవిధంగా నిత్య శృంగారం చేసేవారిలో ఎనర్జీ లెవెల్స్​ కూడా ఎక్కువగా ఉంటాయ‌ట‌. శరీరం చురుగ్గా పనిచేస్తుందట‌. నిద్ర‌లేమి స‌మ‌స్య‌కు కూడా నిత్య శృంగారం చ‌క్క‌ని ప‌రిష్కార‌మ‌ట‌. క్ర‌మం త‌ప్ప‌ని శృంగారంతో నిద్రలో నాణ్యత కూడా పెరుగుతుందట‌. శరీరం రిలాక్స్​గా ఉంటుందట‌. అందువ‌ల్ల రోజూ శృంగారంలో పాల్గొనే జంట‌లు ఉల్లాసంగా ఉంటార‌ట‌.