TS Police Recruitment 2022: నేటి నుంచి తెలంగాణలో పోలీసు ఉద్యోగ నియామ‌కాల‌కు దరఖాస్తు ప్రక్రియ, మే 20 రాత్రి 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు, ప్రాసెస్ మీకోసం

తెలంగాణ‌లో జాబ్‌ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ( TS Govt)గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామ‌కాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ను ప్ర‌భుత్వం జారీ చేసింది.

TS Police Recruitment 2022: నేటి నుంచి తెలంగాణలో పోలీసు ఉద్యోగ నియామ‌కాల‌కు దరఖాస్తు ప్రక్రియ, మే 20 రాత్రి 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు, ప్రాసెస్ మీకోసం
Govt of Telangana | File Photo

తెలంగాణ‌లో జాబ్‌ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ( TS Govt)గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామ‌కాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ను ప్ర‌భుత్వం జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల‌ను (TS Police Recruitment 2022) భ‌ర్తీ చేయ‌నున్నారు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మే 2 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో కానిస్టేబుల్ పోస్టులు 16,027 (సివిల్‌ కానిస్టేబుళ్లు 4,965, ఏఆర్‌ కానిస్టేబుళ్లు 4,424, టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్‌ కానిస్టేబుళ్లు 5,010, స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ 390, ఫైర్‌ 610, డ్రైవర్స్‌ 100 పోస్టులున్నాయి).. ఎస్ఐ పోస్టులు 587 ఉన్నాయి. మే 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు https://www.tslprb.in/ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ల ప్రక్రియ మే 2 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

తెలంగాణలో మే 6వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు, స‌వ‌రించిన ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను విడుదల చేసిన రాష్ట్ర ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు, పూర్తి వివరాలు కథనంలో..

మే 20 రాత్రి 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు సూచించారు.

మొత్తం ఖాళీలు- 16,614

స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Civil)- 4965

స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (AR)- 4423

స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (SAR CPL) (Men) - 100

స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (TSSP) (Men) - 5010

కానిస్టేబుల్ ఇన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్- 390

ఫైర్‌మెన్ ఇన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్- 610

వార్డర్స్ (Male) ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్- 136

వార్డర్స్ (Female) ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్- 10

స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Civil)- 414

స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (AR)- 66

స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (SAR CPL) (Men)- 05

స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (TSSP) (Men)- 23

సబ్ ఇన్‌స్పెక్టర్ (Men) ఇన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్- 12

స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్- 26

డిప్యూటీ జైలర్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్- 8

స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Information Technology & Communications Organization)- 262

స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Mechanics) (Men)- 21

స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Drivers) (Men) - 100

స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Information Technology & Communications Organization)- 22

స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Police Transport Organization)- 03

స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్- 8

విభాగాల వారీగా ఎస్ఐ పోస్టుల వివ‌రాలు: 587

సివిల్ ఎస్ఐలు - 414

ఏఆర్ ఎస్ఐలు - 66

ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్ఐలు - 05

టీఎస్ఎస్‌పీ ఎస్ఐలు - 23

స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్ ఎస్ఐలు - 12

విప‌త్తు నిర్వ‌హ‌ణ, అగ్నిమాప‌క శాఖ - 26

జైళ్ల శాఖ - 08

ఐటీ అండ్ క‌మ్యూనికేష‌న్ ఎస్ఐలు - 22

పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గ‌నైజేష‌న్ – 3

ఫింగ‌ర్ ప్రింట్ బ్యూరోలో ఏఎస్ఐలు - 08

(The above story first appeared on LatestLY on May 02, 2022 04:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).