KG Gold in Rectum: ఏంటి వీడి నడక తేడాగా ఉంది?.. కస్టమ్స్ అధికారులకు డౌట్.. ప్రయాణికుడి బాడీ మొత్తం చెకింగ్.. మలద్వారంలో కిలో బంగారం ఉన్నట్టు గుర్తింపు.. కేరళలో ఘటన

విమానంలో ఖతర్ రాజధాని దోహా నుంచి కేరళలోని కొచ్చి చేరుకున్న ఓ వ్యక్తి నడక తేడాగా ఉండడంతో విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు అనుమానించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా అతడి మలద్వారంలో కిలో బంగారం ఉన్నట్టు తేలింది.

KG Gold in Rectum: ఏంటి వీడి నడక తేడాగా ఉంది?.. కస్టమ్స్ అధికారులకు డౌట్.. ప్రయాణికుడి బాడీ మొత్తం చెకింగ్.. మలద్వారంలో కిలో బంగారం ఉన్నట్టు గుర్తింపు.. కేరళలో ఘటన
Gold (Credits: Gulf News)

Kochi, October 14: దోహా (Doha) నుంచి విమానంలో కేరళలోని (Kerala) కొచ్చి (Kochi) చేరుకున్న ఓ వ్యక్తి నడక తేడాగా ఉండడంతో విమానాశ్రయంలోని కస్టమ్స్ (Customs) అధికారులు అనుమానించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా అతడి మలద్వారంలో (Rectum) కిలో బంగారం ఉన్నట్టు తేలింది. బంగారాన్ని నాలుగు క్యాప్సుల్స్‌లో నింపి తరలిస్తున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం 1066.75 గ్రాములున్నట్టు అధికారులు తెలిపారు.

అరుదైన రెండు తలల పాము.. ధర 25 కోట్ల పైమాటే.. జంతుప్రేమికుడి చలువతో సంరక్షణ కేంద్రానికి.. వీడియో వైరల్..

నిందితుడు కోజికోడ్ జిల్లా కొడువాలి ప్రాంతానికి చెందిన అబ్దుల్ జలీల్‌గా గుర్తించారు. మరోవైపు, మహారాష్ట్ర రాజధాని ముంబైలో వేర్వేరు ఘటనల్లో దాదాపు 15 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ. 7.87 కోట్లు ఉంటుందని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Oct 14, 2022 10:17 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).