Two Headed Snake: అరుదైన రెండు తలల పాము.. ధర 25 కోట్ల పైమాటే.. జంతుప్రేమికుడి చలువతో సంరక్షణ కేంద్రానికి.. వీడియో వైరల్..

రెండు తలల అరుదైన పాము ఒకటి బీహార్ లోని బెగుసరాయ్ జిల్లాలో ఉన్న ఓ గ్రామస్థులకు ఇటీవల దొరికింది. అయితే, బహిరంగ మార్కెట్లో ఈ పాము విలువ రూ. 25 కోట్లు ఉంటుందని, చైనా వంటి దేశాల్లో ఈ పాము మాంసాన్ని ఔషదాలు, హోటల్ డిష్ లలో వాడుతారని తెలుసుకున్న కొందరు.. తక్కువ ధరకు ఈ సర్పాన్ని కొందామని గ్రామస్థులతో బేరమాడారు. తర్వాత??

Two Headed Snake: అరుదైన రెండు తలల పాము.. ధర 25 కోట్ల పైమాటే.. జంతుప్రేమికుడి చలువతో సంరక్షణ కేంద్రానికి.. వీడియో వైరల్..
Two headed snake (Photo Credit- Twitter/@BiharTak)

Patna, October 14: రెండు తలల (Two Headed) అరుదైన పాము (Rare Snake) ఒకటి బీహార్ లోని (Bihar) బెగుసరాయ్ జిల్లాలో ఉన్న ఓ గ్రామస్థులకు ఇటీవల దొరికింది. అయితే, బహిరంగ మార్కెట్లో (Market) ఈ పాము విలువ రూ. 25 కోట్లు ఉంటుందని, చైనా వంటి దేశాల్లో ఈ పాము మాంసాన్ని ఔషదాలు, హోటల్ డిష్ లలో వాడుతారని తెలుసుకున్న కొందరు.. తక్కువ ధరకు ఈ సర్పాన్ని కొందామని గ్రామస్థులతో బేరమాడారు. ఈ విషయం తెలుసుకున్న ముకేష్ పాశ్వాన్ అనే జంతు ప్రేమికుడు ఆ అరుదైన, అంతరించే దశలో ఉన్న ఈ సర్పాన్ని ఎలాగైనా రక్షించాలనుకున్నాడు.

రాత్రి బైక్ పై ఒంటరిగా ఇంటికి వెళ్తున్న మహిళ.. వాహనాన్ని వెంబడించిన దుండగులు.. నిర్మానుష్య ప్రదేశం రాగానే ఆమె బైక్ ను బలంగా ఢీకొట్టిన కామంధులు.. మహిళ కిందపడగానే పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్.. ఒంగోలులో దారుణం

వెంటనే ఈ విషయాన్ని జిల్లాలోని ఓ కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. పామును వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని అధికారులను కోర్టు ఆదేశించింది. అధికారులు అలాగే చేశారు. అనంతరం పామును సంరక్షణ కేంద్రానికి తరలించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టుకు ఓ కంటైనర్ లో పామును తీసుకొచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

(The above story first appeared on LatestLY on Oct 14, 2022 09:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).