Shirish Bharadwaj Dies: మెగాస్టార్‌ చిరంజీవి మాజీ అల్లుడు అనారోగ్యంతో మృతి, లంగ్స్ డ్యామేజ్ కావడంతో శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ కన్నుమూత

టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ (39) చెన్నైలో అనారోగ్యంతో మృతి చెందారు. శ్రీజతో విడిపోయిన తర్వాత 2019లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విహనను శిరీష్‌ భరద్వాజ్‌ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు చెన్నైలో ఉన్నట్లు సమాచారం

Shirish Bharadwaj Dies: మెగాస్టార్‌ చిరంజీవి మాజీ అల్లుడు అనారోగ్యంతో మృతి, లంగ్స్ డ్యామేజ్ కావడంతో శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ కన్నుమూత
Shirish Bharadwaj Dies (Photo-Instagram)

టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ (39) చెన్నైలో అనారోగ్యంతో మృతి చెందారు. శ్రీజతో విడిపోయిన తర్వాత 2019లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విహనను శిరీష్‌ భరద్వాజ్‌ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు చెన్నైలో ఉన్నట్లు సమాచారం. అయితే, కొంత కాలంగా శిరీష్‌ భరద్వాజ్‌ అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన లంగ్స్ డ్యామేజ్ కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొంత సమయం క్రితం మృతి చెందారు.  మెగా, అల్లు ఫ్యామిలీ మ‌ధ్య మరింత ముదిరిన వివాదం, అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చిన సాయి ధ‌ర‌మ్ తేజ్

2007లో శ్రీజను శిరీష్‌ భరద్వాజ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దలకు తెలియకుండా జరిగిన ఈ వివాహం అప్పట్లో సంచలనం రేపింది. అదనపు కట్నం కోసం శిరీష్‌ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని 2012లో శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం వీరిద్దరి మధ్య విభేదాలు పెరగడంతో 2014లో విడాకులు తీసుకున్నారు.

(The above story first appeared on LatestLY on Jun 19, 2024 12:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).