Uttar Pradesh Girl Kidnapped: మలవిసర్జన కోసం వెళ్లిన బాలికపై అత్యాచారం, 16 ఏళ్ల బాలికను కారులో కిడ్నాప్ చేసి...కదులుతున్న కారులోనే గ్యాంగ్ రేప్ చేసిన దుండగులు
ముగ్గురు వ్యక్తులు ఒక బాలికను కిడ్నాప్ (Kidnap) చేశారు. బలవంతంగా కారులోకి ఎక్కించి హైవే పైకి వెళ్లారు. కదులుతున్న కారులో ఇద్దరు వ్యక్తులు ఆ బాలికపై అత్యాచారానికి (Rape) పాల్పడ్డాడు. (Girl Kidnapped, Raped In Car) బాధితురాలి ఫిర్యాదుతో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Lucknow, AUG 22: ముగ్గురు వ్యక్తులు ఒక బాలికను కిడ్నాప్ (Kidnap) చేశారు. బలవంతంగా కారులోకి ఎక్కించి హైవే పైకి వెళ్లారు. కదులుతున్న కారులో ఇద్దరు వ్యక్తులు ఆ బాలికపై అత్యాచారానికి (Rape) పాల్పడ్డాడు. (Girl Kidnapped, Raped In Car) బాధితురాలి ఫిర్యాదుతో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 20న ఉదయం 6 గంటలకు 16 ఏళ్ల బాలిక మలవిసర్జన కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ బాలిక నివసించే ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు.
కారులో ఎక్కించుకుని హైవేపై డ్రైవ్ చేశారు. కదులుతున్న కారులో ఇద్దరు వ్యక్తులు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను బెదిరించి రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. కాగా, బయటకు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆమె కోసం చుట్టుపక్కల వెతికారు. చివరకు ఇంటికి చేరుకున్న ఆ బాలిక జరిగిన సంగతి తన తల్లికి చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Aug 22, 2024 08:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

