Kolkata doctor rape-murder case CBI to conduct polygraph test on main accused

Kolkata, AUG 23: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌క‌తా ట్రైనీ డాక్టర్ హత్యాచార (Kolkata) ఘటనపై గత 11 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆర్జీ కర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో (RG Kar) ట్రైనీ డాక్టర్‌ను అత్యంత దారుణంగా చంపిన హంతకులను కఠినంగా శిక్షించాలని దేశమంతా ముక్తకంఠంతో నినదిస్తోంది. అటు సుప్రీంకోర్టులోనూ ఈ హత్యోదంతంపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రైనీ వైద్యురాలి హత్యోదంతంలో విస్మయకర వాస్తవాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పోస్ట్‌మార్టం రిపోర్టులోని అంశాలను నేషనల్ మీడియా వెల్లడించడంతో భయంకర నిజాలు బయటపడ్డాయి. యువ వైద్యురాలిని చెరబట్టి కిరాతంగా ప్రాణాలు తీశారని పోస్ట్‌మార్టం రిపోర్టులో రివీలయింది. బాధితురాలిని దారుణంగా హింసించి చంపారని, ఆమె శరీమంతా గాయాలున్నాయని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. ముఖం, మెడ, రెండు చెంపలపై గాయాలున్నాయని తెలిపింది. ముఖమంతా గీసుకుపోయి.. పెదవి మధ్యలో గాయమైంది. మెడ ముందు భాగంలో కొరికిన గుర్తులతో పాటు, రెండు పెదవుల లోపలి భాగంలోనూ గాయలయ్యాయి. రెండు కళ్లు, నోటి నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. థైరాయిడ్ కార్డిలేజ్ చితికిపోవడంతో పాటు చేతి వేళ్లు, ఎడమ కాలిపై గాయాలున్నాయని పోస్ట్‌మార్టం రిపోర్టులో పేర్కొన్నారు.

Noida: వీడియో ఇదిగో, శవాలను భద్రపరిచే మార్చురి గదిలో శృంగారం, అసభ్యకర స్థితిలో కెమెరాకు చిక్కిన ఇద్దరు ఉద్యోగులు 

ఎడమ కాలు దారుణంగా దెబ్బతిందని తెలిపారు. అయితే బాధితురాలు చనిపోవడానికి ముందు రేప్ జరిగిందా, చనిపోయిన తర్వాత హత్యాచారానికి పాల్పడ్డారా అనే దానిపై క్లారిటీ లేదన్నారు.  అయితే బాధితురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందన్న అనుమానాలకు పోస్ట్‌మార్టం రిపోర్ట్ బలం చేకూర్చింది. ప్రధాన నిందితుడు పోలీస్ వలంటీర్ సంజయ్ రాయ్‌తో పాటు మరికొందరి ప్రమేయం ఉంచొచ్చని మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. మృతురాలి శరీరంపై చాలా గాయాలున్నాయని, ఒక వ్యక్తి ఇన్ని గాయాలు చేయలేడని.. ఇది ముమ్మాటికీ గ్యాంగ్ రేప్ అని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అడిషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సువర్ణ గోస్వామి ఆరోపించారు. అయితే సీబీఐ తాజాగా సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసిన స్టేటస్ రిపోర్ట్‌లో మృతురాలిపై గ్యాంగ్ రేప్ జరగలేదని పేర్కొన్నట్టు తెలుస్తోంది.

Snake Attack in Thailand: వామ్మో..టాయెలెట్లో కూర్చుని ఉండగా లోపల నుంచి పురుషాంగంపై కాటేసిన కొండ చిలువ, నొప్పితో అల్లాడిపోయిన బాధితుడు 

కాగా, అత్యాచారం హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోష్‌తో పాటు మరో నలుగురికి పాలిగ్రాఫ్ పరీక్ష (polygraph test) నిర్వహించేందుకు కోర్టు అనుమతి కోరింది. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు గత వారం కోల్‌కతా పోలీసుల నుంచి దర్యాప్తును సీబీఐ స్వీకరించింది. మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోష్‌ను ఇప్పటికే పలుసార్లు ప్రశ్నించింది. జూనియర్‌ వైద్యురాలి హత్యాచార ఘటనలో ఆయన పాత్రపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వైద్యురాలి మృతదేహాన్ని చూసేందుకు ఆమె తల్లిదండ్రులను దాదాపు మూడు గంటలపాటు సందీప్ ఘోష్‌ వేచి ఉంచిన ఆరోపణలపై కూడా సీబీఐ ఆయనను ప్రశ్నించింది. అలాగే డాక్టర్‌ మృతదేహాన్ని గుర్తించిన సెమినార్ హాల్ ప్రక్కనే ఉన్న గదుల పునరుద్ధరణ పనుల గురించి కూడా ఘోష్‌ను అడిగింది. ఆయన చెప్పిన సమాధానాలను లై డిటెక్టర్‌ టెస్ట్‌ ద్వారా పోల్చి చూడాలని సీబీఐ భావిస్తున్నది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి అరెస్టైన వాలంటీర్ సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు సీబీఐ ఇప్పటికే హైకోర్టు అనుమతిని పొందింది.