85 Year Old Woman Raped: 85 ఏండ్ల వృద్ధురాలిపై అత్యాచారం పెదవులను బ్లేడ్‌తో కోసి పాశవికంగా లైంగికదాడి చేసిన దుండగులు, ఢిల్లీలో సంచలనం సృష్టించిన ఘటన

85 ఏండ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి జరిగింది(Elderly woman raped). నిందితుడు ఆమెను కొట్టడంతోపాటు బ్లేడ్‌తో పెదవులు కోశాడు. దేశ రాజధాని ఢిల్లీలో (Delhi crime) ఈ సంఘటన జరిగింది. నేతాజీ సుభాష్ ప్రాంతంలో 85 ఏండ్ల వృద్ధురాలు నివసిస్తున్నది.

85 Year Old Woman Raped: 85 ఏండ్ల వృద్ధురాలిపై అత్యాచారం పెదవులను బ్లేడ్‌తో కోసి పాశవికంగా లైంగికదాడి చేసిన దుండగులు, ఢిల్లీలో సంచలనం సృష్టించిన ఘటన
Representative Image (File Image)

New Delhi, SEP 02: 85 ఏండ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి జరిగింది(Elderly woman raped). నిందితుడు ఆమెను కొట్టడంతోపాటు బ్లేడ్‌తో పెదవులు కోశాడు. దేశ రాజధాని ఢిల్లీలో (Delhi crime) ఈ సంఘటన జరిగింది. నేతాజీ సుభాష్ ప్రాంతంలో 85 ఏండ్ల వృద్ధురాలు నివసిస్తున్నది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక వ్యక్తి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. నిద్రిస్తున్న వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెను కొట్టడంతోపాటు పెదవులను బ్లేడ్‌తో కోశాడు. ఈ నేపథ్యంలో ఆ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది.

Korutla Deepthi Murder Case: అక్కను నేనే చంపేశా..ఒప్పుకున్న చందన... వోడ్కా తాగించి, చేతులు కట్టేసి, ప్రియుడితో కలిసి అక్కను దారుణంగా హత్య చేసిన చెల్లెలు 

కాగా, ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. 28 ఏండ్ల ఆకాష్‌ను నిందితుడిగా గుర్తించారు. అతడ్ని అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ మహిళా కమిషన్‌ (DCW) చీఫ్‌ స్వాతి మలివాల్ కూడా ఈ సంఘటనపై స్పందించారు. ఈ కేసు వివరాలు, నివేదికను అందజేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.

(The above story first appeared on LatestLY on Sep 02, 2023 08:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).