కోరుట్ల పట్టణంలో సంచలనం సృష్టించిన దీప్తి అనే యువతి హత్య కేసులో తన అక్కను తానే చంపినట్లు సోదరి చందన ఒప్పుకుంది. తాను ప్రేమించిన వాడు ఇతర మతస్థుడు కావడంతో ఒప్పుకోలేదని అందుకే అక్క దీప్తి ముక్కు, మూతికి ప్లాస్టర్ వేసి చంపినట్లు చందన పోలీసుల ముందు పేర్కొంది. హత్యకు సహకరించిన వారిలో చందన ప్రియుడు ఉమర్ షేక్ సుల్తాన్ అతడి తల్లి సయ్యద్ అలియా మహబూబ్ సైతం ఉన్నట్లు పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే కోరుట్ల పట్టణానికి చెందిన బంక శ్రీనివాస్ రెడ్డి పెద్ద కూతురైన బంక దీప్తి ( 22 సంవత్సరాలు) తన ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందిందని కోరుట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగా పలు సంచలన వెలుగులోకి వచ్చాయి.
ఫిర్యాదు దారుడు అయిన బంక శ్రీనివాస్ రెడ్డికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు సంతానం ఉంది. పెద్ద కూతురైన బంక దీప్తి గత కొద్ది రోజుల నుండి సాఫ్ట్ వేర్ జాబ్ తన ఇంటిలో నుండి వర్క్ ఫ్రం హోం చేస్తున్నది. చిన్న కూతురైన బంక చందన 2019 సంవత్సరంలో మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ లో జాయిన్ అయింది. ఈ సందర్భంలో తన క్లాస్మేట్ అయిన ఉమర్ షేక్ సుల్తాన్ (25 సంవత్సరాలు) యువకునితో పరిచయమై వారి పరిచయం ప్రేమగా మారింది. ఈ సందర్భంలో వారి బీటెక్ పూర్తయి చందన గత కొద్ది రోజుల నుండి కోరుట్లలోని తన ఇంటి వద్దనే ఉంటున్నది. తన బాయ్ ఫ్రెండ్ అయినా షేక్ సుల్తాన్ కు చందన ఫోన్ చేయగా అప్పుడప్పుడు కోరుట్ల కు వచ్చి చందనను కలుస్తుండేవాడు. ఈ క్రమంలో గత నెల 19వ తేదీన రోజున కోరుట్లకు ఉమర్ వచ్చినప్పుడు, చందన ఉమర్ తో మన పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరు, బయటికి పోయి పెళ్లి చేసుకుందామని చెప్పగా, అందుకు ఉమర్ తన వద్ద ఉద్యోగం, డబ్బులు లేవని, బయటకు వెళ్లి ఎలా జీవిస్తామని చందనతో ఉమర్ తన పరిస్థితి వివరించాడు.
మనం ఏదైనా సరే పెళ్లి చేసుకోవాలని చందన ఉమర్ కు చెప్పగా ఉమర్ వాట్సాప్ కాల్ ద్వారా తన కుటుంబ సభ్యులైన తల్లి సయ్యద్ ఆలియా మహబూబ్, చెల్లె ఫాతిమా, తన ఫ్రెండ్ అయిన హఫీజ్ కలిసి చందనతో మాట్లాడారు. తర్వాత రెండు రోజులకు చందన ఉమర్ కు ఫోన్ చేసి మా ఇంట్లో బంగారం డబ్బులు బాగా ఉన్నాయని వాటిని తీసుకెళ్లి, మనం పెళ్లి చేసుకొని బతుకుదామని చెప్పింది. అప్పుడు ఉమర్ తన కుటుంబ సభ్యులతో ఈ చందన చెప్పిన విషయం తెలిపాడు.
అప్పుడే ఉమర్ కుటంబ సభ్యులతో కలిసి చందన ప్లాన్ చేసింది. పథకంలో భాగంగా చందన ఉమర్ కి కాల్ చేసి ఆగస్టు 28 తేదీన మా తల్లిదండ్రులు హైదరాబాదులోని ఒక పంక్షన్ కి వెళ్తున్నారు. అక్క దీప్తి, చందన ఇద్దరమే ఉంటామని ఉమర్ కు చెప్పి రమ్మని చెప్పింది. 28వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో ఉమర్ తన కారులో హైదరాబాదు నుండి బయలుదేరి మధ్యహ్నం 11:00 గంటలకు కోరుట్లకు చేరుకున్నాడు.
బంక చందన 2019లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజిలో బీటెక్ చదువుతుండగా నెల్లూరు వాస్తవ్యుడైన సీనియర్ విద్యార్థి ఉమర్ షేక్ సుల్తాన్తో ప్రేమ ఏర్పడి పెళ్లి చేసుకోవాలని చందన ఒత్తిడి చేసింది.
జీవితంలో ఇంకా సెటిల్ కాలేదని అతడు చెప్పగా ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీసుకొని ఇంట్లో నుండి… https://t.co/GaTvJburyi pic.twitter.com/96GJuk1x0e
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2023
పథకం ప్రకారం చందన తన అక్క దీప్తికి మద్యం త్రాగించింది. తాను పడుకున్న తర్వాత రాత్రి 29వ తేదీ రాత్రి 2 గంటల సమయంలో ఉమర్ ను తన ఇంటికి రమ్మని చందన మెసేజ్ చేయగా, నిందితుడు ఉమర్, చందన ఇంటి వెనుక ఖాళీ స్థలంలో కారును పార్కు చేసి ఇంటి వెనకాల గేటు నుండి ఇంటిలోకి ప్రవేశించాడు. పథకం ప్రకారం చందన, ఉమర్ ఇంటి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బులు సర్దుతుండగా, అలికిడికి అక్క దీప్తి లేచి వచ్చి, సోదరి చందన, ఉమర్ లను ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తూ గట్టిగా కేకలు వేసింది. దీంతో ప్యాకింగ్ చేసే టేప్ తో చందన, ఉమర్ లు ఇద్దరు కలిసి దీప్తి ముక్కు, మూతికి గుడ్డ చుట్టి, చున్నీతో చేతులు కట్టేశారు. అంతేకాదు నోరు, ముక్కుపై టేపును అంటించారు. బాధితురాలు దీప్తి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత కట్లన్నీ విప్పేసి మద్యం అతిగా సేవించి చనిపోయిందని నమ్మించే విధంగా సీన్ క్రియేట్ చేసి డబ్బు, నగలతో ఇంటి నుండి పారిపోయారు.
అనంతరం బంక శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులను పట్టుకోవడానికి జగిత్యాల SP A. భాస్కర్ ఆదేశాల మేరకు మెట్ పల్లి DSP రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోరుట్ల CI ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని, ఐదు బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఐదుగురు నిందితులు కలిసి మహారాష్ట్ర వైపు పారిపోతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు. ఆర్మూర్, బాల్కొండ రూట్లో జై వీర్ తేజ దాబా వద్ద ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురు నిందితుల్లో A-1 బంక చందన (Korutla), A-2 ఉమర్ షేక్ సుల్తాన్ (Nellore), A-3 సయ్యద్ అలియా మహబూబ్ , A-4 షేక్ అసియా ఫాతిమా, A-5 హఫీజ్ లను అదుపులో తీసుకొని కోర్టులో విచారిస్తున్నారు.