Isha Alya Shot Dead: హైవేపై టీ కోసం ఆగిన సినీ నటిని కాల్చిచంపిన దారిదోపిడి దొంగలు, భర్తపైనే అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు
ముగ్గురు కలిసి కార్‌లో బుధవారం రాంచీ నుంచి పశ్చిమ బెంగాల్‌కు పయనమయ్యారు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై బగ్నాన్‌లోని మహిశ్రేఖ దగ్గర విశ్రాంతి కోసం కార్ ఆపడంతో.. ముగ్గురు దుండగులు ప్రకాష్ కుమార్ పై దాడి చేసినట్లు, ఆ దొంగలను ప్రతిఘటించే క్రమంలో రియా కుమారిని పాయింట్ బ్లాక్ రేంజ్‌లో దుండగులు కాల్చి చంపి అక్కడి నుంచి పారిపోయినట్లు వెల్లడించాడు భర్త ప్రకాష్.
Kolkata, DEC 29: జార్ఖండ్‌లో ఇషా అల్యా (Isha Alya) పేరుతో పాపులారిటీ సంపాదించుకున్న నటి ‘రియా కుమారి’ (Riya kumari). జార్ఖండ్‌లోని పలు రీజినల్ సినిమాలు, ఆల్బమ్ సాంగ్స్ లో నటించిన ఈ భామ బుధవారం దారుణ హత్యకి ( Isha Alya Shot dead) గురైంది. రియా కుమారి భర్త పేరు ప్రకాష్ కుమార్ (Prakash kumar) ఒక నిర్మాత. రీజినల్ మూవీస్ అండ్ ఆల్బమ్ తెరకెక్కిస్తుంటాడు. వీరిద్దరికి రెండున్నరేళ్ల ఒక పాప కూడా ఉంది. కాగా ఈ ముగ్గురు కలిసి కార్‌లో బుధవారం రాంచీ నుంచి పశ్చిమ బెంగాల్‌కు పయనమయ్యారు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై బగ్నాన్‌లోని మహిశ్రేఖ దగ్గర విశ్రాంతి కోసం కార్ ఆపడంతో.. ముగ్గురు దుండగులు ప్రకాష్ కుమార్ పై దాడి చేసినట్లు, ఆ దొంగలను ప్రతిఘటించే క్రమంలో రియా కుమారిని పాయింట్ బ్లాక్ రేంజ్‌లో దుండగులు కాల్చి చంపి అక్కడి నుంచి పారిపోయినట్లు వెల్లడించాడు భర్త ప్రకాష్.
ఆ తరువాత ఆమెను కాపాడుకునేందుకు హాస్పిటల్ కోసం 3 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్లినట్లు, అయితే అప్పటికే ఆమె చనిపోయింది అని పోలీసులకు తెలియజేశాడు ప్రకాష్. అయితే ఇక్కడ ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పోలీసులు కూడా ఈ కేసుని కేవలం ప్రకాష్ చెప్పిన స్టేట్‌మెంట్ నుంచే కాకుండా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ చుట్టూ పక్కల గ్రామస్థులను ప్రశ్నిస్తున్నారు, అక్కడి సీసీ టీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Dec 29, 2022 10:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

