Cambodia Fire Hotel Casino Engulfs in Blaze Representational Image (Photo Credits: IANS)

Poipet, DEC 29: కంబోడియాలో ఘోర అగ్ని ప్రమాదం (Cambodia Fire) జరిగింది. పోయ్‌పెట్ లోని గ్రాండ్ డైమండ్ క్యాసినోలో (Grand Diamond Casino) మంటలు చెలరేగాయి. దీంతో 10 మంది మరణించారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గతరాత్రి జరిగిన ప్రమాదంలో మంటలు అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. దాదాపు ఎనిమిది గంటలు అయినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో క్యాసినోలో (Grand Diamond Casino) 400 మంది ఉన్నారని, అయితే పొగలు రావడంతో చాలా మంది బయటకు పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

 

ఇంకా చాలామంది లోపల చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ టీంలు శ్రమిస్తున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఈ ఘటనలో ఎక్కువ మంది బాధితులు థాయిలాండ్ కు చెందిన వారు, కంబోడియన్లే ఉన్నాయని అధికారులు తెలిపారు. న్యూఇయర్ దగ్గర పడుతుండటంతో క్యాసినోకు రద్దీ పెరిగింది. ఈ క్రమంలో ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.