Monalisa: కుంభమేళా మోనాలిసా.. వెండితెర డెబ్యూకి రంగం సిద్ధం, తొలి సినిమాకు సంతకం చేసిన మోనాలిసా

డైరీ ఆఫ్ మ‌ణిపూర్ సినిమాలో మోనాలిసా న‌టించ‌నున్న‌ట్లు ద‌ర్శ‌కుడు సనోజ్ మిశ్రా చెప్పారు.

Monalisa: కుంభమేళా మోనాలిసా.. వెండితెర డెబ్యూకి రంగం సిద్ధం, తొలి సినిమాకు సంతకం చేసిన మోనాలిసా
All set for mahakumbh monalisa acting debut(X)

Delhi, Jan 30:  ఉత్తరప్రదేశ్‌ కుంభమేళాలో(Maha Kumbh 2025) ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారిపోయింది మోనాలిసా(Monalisa) పూస‌ల దండ‌లు, రుద్రాక్ష‌లు అమ్ముకునేందుకు వ‌చ్చిన మోనాలిసా అందానికి అంతా ఫిదా అయ్యారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె కళ్లకు ఫిదా కాగా కుంభమేళాకు వచ్చిన వారు ఆమెతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు.

ఈ నేపథ్యంలో దర్శకుడు సనోజ్ మిశ్రా(director sanoj Mishra) ఒకడుగు ముందుకేసి సినిమా ఆఫర్ సైతం ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. చెప్పినట్లుగానే ఆమెను కలిసేందుకు కుంభమేళాకు రాగా ఆమె తన స్వస్థలానికి వెళ్లినట్లు తెలియడంతో ఇవాళ మోనాలిసాను కలిసేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్లారు.  పాన్‌ కార్డు సమాచారాన్ని తమిళంలోనూ అందించండి.. కేంద్రానికి నటుడు విజయ్ సేతుపతి విజ్ఞప్తి, ప్రజలకు అర్ధమయ్యే భాషలో ఉండాలని కోరిన విజయ్

మోనాలిసా స్వగ్రామం మహేశ్వర్‌లో ఆమె కుటుంబ సభ్యులను కలిశారు సనోజ్ మిశ్రా. ఈ నేపథ్యంలో మోనాలిసా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆమె సినిమాల్లో (Bollywood movie)నటించేందుకు ఒప్పించారు.

All set for mahakumbh monalisa acting debut

డైరీ ఆఫ్ మ‌ణిపూర్ సినిమాలో మోనాలిసా న‌టించ‌నున్న‌ట్లు ద‌ర్శ‌కుడు సనోజ్ మిశ్రా చెప్పారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి మరో నెల రోజుల సమయం ఉండటంతో ఆమెకు యాక్టింగ్‌లో శిక్షణ ఇప్పిస్తామని తెలిపాడు.

ఈ సందర్భంగా మోనాలిసాతో పాటు ఆమె కుటుంబాన్ని క‌లిసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాదాపు రూ.20 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెర‌కెక్క‌నుండగా బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన మోనాలిసాకు అంతా ఆల్‌ ది బెస్ట్ చెబుతున్నారు.

(The above story first appeared on LatestLY on Jan 30, 2025 06:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).